అవార్డు  గ్రహీలకు చిరు సత్కారం

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్ధలు నిర్వహించిన పోటీలలో బహుమతులు అందుకున్న నగరానికి చెందిన ప్రెస్‌ఫొటోగ్రాఫర్‌లను ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ పక్షాన నేడు స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో చిరుసత్కారం నిర్వహించారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కె కిరణ్‌కుమార్‌రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ యువనాయకులు ఆదిరెడ్డి వాసు, సాక్షి దినపత్రికి డెస్క్‌ఇన్‌ఛార్జి కృష్ణారావు, ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి డిఎ లింకన్‌, సీనియర్‌ పాత్రికేయులు బివిఎస్‌ భాస్కర్‌, ఎస్‌ఎస్‌ చారిలు పాల్గొని ప్రెస్‌ ఫొటోగ్రాఫర్‌లు ఎస్‌పి రాజేశ్వరావు(బాబి)(ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్‌), గరగ ప్రసాద్‌(సాక్షి ఫొటోగ్రాఫర్‌)లకు శాలువా కప్పి, పూలమాలవేసి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ రాజమండ్రి ప్రెస్‌ఫొటోగ్రాఫర్‌లకు పురస్కారాలు దక్కడం గర్వకారణం అని, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ ఉపాధ్యక్షులు నమ్మి శ్రీనివాస్‌, కోశాధికారి బి హరికృష్ణ, సంయుక్త కార్యదర్శి కర్రి ఎస్‌ఎస్‌ రెడ్డి, సభ్యులు ఆర్‌వివి సత్యనారాయణ, సాయిరామ్‌, కృష్ణకుమార్‌, మురాలి శ్రీనివాస్‌, రాజు, వివిధ పత్రికలకు చెందిన పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు, సబ్‌ఎడిటర్‌లు పాల్గొన్నారు. అనంతరం అదిరెడ్డి అప్పారావు, వాసులు పాత్రికేయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, బాణాసంచాను అందజేశారు. ప్రెస్‌క్లబ్‌ తరపున స్వీట్‌ ప్యాకెట్‌లు అందజేశారు.

తెదేపా పాలనకు మద్దతు తెలపండి

9వ డివిజన్‌లో ఇంటింటికి తెలుగుదేశం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలిస్తున్న  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలందరూ మద్దతు తెలపాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. 9వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కోసూరి చంఢీప్రియ ఆధ్వర్యంలో బర్మాకాలనీ వద్ద నుండి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీశేషసాయి, ఆర్యాపురం కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శంకరరావు, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. స్ధానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఫ్లోర్‌లీడర్‌ వర్రే శ్రీనివాసరావు,  ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్‌లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మి, కోరుమెల్లి విజయశేఖర్‌, గరగ పార్వతి, బెజవాడ రాజ్‌కుమార్‌, కొమ్మ శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, కిలపర్తి శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మావతి, నాయకులు రొబ్బి విజయశేఖర్‌, షేక్‌ సుభాన్‌, సప్పా వెంకటరమణ, సూరంపూడి శ్రీహరి, ఉప్పులూరి జానకీరామయ్య, గరగ మురళీకృష్ణ, తంగేటి సాయి, బొచ్చ శ్రీను, బిల్డర్‌ చిన్న, నల్లా రామాంజనేయులు, కోరాడ సత్యశ్రీదేవి, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, పితాని కుటుంబరావు, అట్టాడ రవి, మహబూబ్‌ జానీ, మజ్జి శ్రీనివాస్‌, రెడ్డి సతీష్‌, టేకుమూడి నాగేశ్వరరావు, దమరసింగ్‌ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కమ్యూనిస్టు ప్రభుత్వం

కేరళలో సిపిఎం దమనకాండకు నిరసనగా బిజెపి జనసురక్షా నిరసన ర్యాలీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. కేరళలోని సిపిఎం ప్రభుత్వం జనసంఘ్‌, బిజేపి, విద్యార్థి పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులపై సాగిస్తున్న దమనకాండను నిరసిస్తూ నగర బిజేపి ఆధ్వర్యంలో ఈరోజు జనసురక్షా నిరసన ర్యాలీ నిర్వహించింది. అర్భన్‌ బిజేపి అధ్యక్షులు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కోటగుమ్మం సెంటర్‌ వద్ద శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కేరళలో 1970 నుంచి సిపిఎం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇటువంటి దమనకాండ జరుగుతుందన్నారు. సిపిఎం మూకల దాడులలో ఇప్పటి వరకు 4 వేలమంది చనిపోయారని తెలిపారు. పినరయి విజయ్‌ అధికారంలోకి వచ్చాక 700 మందిని హతమార్చారని తెలిపారు. కేరళ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, సాగిస్తున్న దమనకాండపై జనసురక్షా యాత్రను అడ్డుకునే విధంగా అక్కడ ప్రభుత్వం కరెంట్‌ కట్‌ చేయడం, హర్తాల్‌కు పిలుపు నివ్వడం వంటి చర్యలకు పాల్పడిందని విమర్శించారు. కమ్యూనిస్టుల చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకే జన సురక్షా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. సిపిఎం గూండాల్లారా ఖబడ్దార్‌ ఖబడ్దార్‌, కేరళ సిఎం డౌన్‌ డౌన్‌ అంటూ బిజేపి శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పొట్లూరి రామ్మోహనరావు, ధార్వాడ రామకృష్ణ, రేలంగి శ్రీదేవి, బూర రామచంద్రరావు, సత్తి మూలారెడ్డి, రుక్మాంగరావు, కాలెపు సత్యసాయిరామ్‌, అడపా వరప్రసాద్‌, తంగెళ్ళ పద్మావతి, నిల్లా ప్రసాద్‌, పడాల నాగరాజు, బేతిరెడ్డి ఆదిత్య, తంగెళ్ళ శ్రీనివాస్‌, కొత్తపల్లి గీత విజయలక్ష్మి, ఇజ్జరౌతు విజయలక్ష్మి, నందివాడ సత్యనారాయణ, పేర్ని నూకరాజు, కట్టా జనార్ధనరావు, బర్ల శివశంకర్‌, జక్కంశెట్టి మహేష్‌, నల్లమిల్లి బ్రహ్మానందం, బొండాడ చినరాజు, చింతాలమ్మ, దుంపా శ్రీదేవి, గొలుగూరి రత్నారెడ్డి, వెత్సా రాంప్రసాద్‌, విప్పర్తి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటికీ తెదేపా కార్యక్రమ నిర్వహణ బాధ్యులుగా ఆదిరెడ్డి, గన్ని

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమ నిర్వహణ బాధ్యులుగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణలతో ద్విసభ్య కమిటీని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌, ఎమ్మెల్సీ వి.వి.వి.చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.

ఒకే అంశం.. రెండు భిన్నమైన తీర్పులు

చర్చనీయాంశమైన వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు స్పందన
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 18 : ఆంధ్రప్రదేశ్‌,  తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్‌, కాళోజి నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాలతో సహా దేశవ్యాప్తంగా డీఎం, డీసిహెచ్‌ తదితర సూపర్‌ స్పెషాలిటీ కోర్సులలో వివిధ కారణాలతో ఖాళీగా మిగిలిపోయిన 553 సీట్ల భర్తీ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుంచి రెండు భిన్నమైన తీర్పులు రావడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకే అంశంపై వాదనలను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తిరస్కరించగా కొద్దిరోజుల వ్యవధిలో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆమోదించడం విశేషం. వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి కౌన్సెలింగ్‌ గడువును పొడిగించేందుకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఖన్విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గత నెల 22న తిరస్కరించింది. ఈ కేసులో ప్రైవేట్‌ కళాశాలల తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌, తెలంగాణా, ఎ.పి. విద్యార్ధుల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అల్లంకి రమేష్‌ (రాజమహేంద్రవరం) తమ వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా గడువు పెంచడానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించగా ఎలాంటి అభ్యరతరం లేదని, సీట్లు ఖాళీ ఉన్న విషయం వాస్తవమేనని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మణీందర్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు. అయితే కౌన్సెలింగ్‌ గడువు పెంపునకు తమకు అభ్యరతరం ఉందని మెడికల్‌ కౌన్సెలింగ్‌ ఆఫ్‌ ఇండియా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు అనంతరం గడువు పెంచడానికి అనుమతి ఇవ్వడం లేదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సీట్ల భర్తీ కోసం తేదీల పొడిగింపునకు వేసిన పిటీషన్‌ను గతనెల 22న సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీట్లను భర్తీ చేయకూడదంటూ ఈనెల 9న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా ఇదే అంశంపై  మళీ దాఖలైన రిట్‌ పిటీషన్‌పై  ఈనెల 11వ తేదీన జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌, జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌తో కూడిన ధర్మాసనం సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన 553 సీట్లు భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలతోపాటు  ఎ.పి. నుంచి పిన్నమనేని సిద్ధార్థ కళాశాల, నారాయణ వైద్య కళాశాలలు సుప్రీంకోర్టులో ఈ పిటీషన్‌ను దాఖలు చేయగా ఎ.పి. నుంచి పలువురు విద్యార్ధులు, కళాశాలల తరపున న్యాయవాది అల్లంకి రమేష్‌ వాదనలు వినిపించగా నాలుగు షరతులతో సీట్ల భర్తీ గడువును పొడిగించేందుకు ఇద్దరు సభ్యులు ధర్మాసనం షరతులు విధించింది. రెండురోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు నుంచి ఒకే అంశంపై రెండు భిన్నమైన తీర్పులు రావడంతో న్యాయ రంగంలో జ్యుడీషియల్‌ డిసిప్లిన్‌ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇటువంటి భిన్నమైన ఈ అంశంలో రాజమహేంద్రవరానికి చెందిన సుప్రీంకోర్టు సీనియర్‌  న్యాయవాది అల్లంకి రమేష్‌ వాదనలు వినిపించడం విశేషం.

రక్తదానంతో ప్రాణదానం : ఎస్పీ

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 17 : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చని, ప్రతి ఒక్కరు రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలని రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీస్‌ జిల్లా ఎస్పీ బి రాజకుమారి పేర్కొన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈరోజు స్ధానిక ఉమా రామలింగేశ్వర కళ్యాణమండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. వివిధ విద్యాసంస్ధలు, ప్రజా సంఘాల వారుతో పాటు, పోలీసు సిబ్బంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. రక్తదాన శిబిరాన్ని ఎస్పీ రాజకుమారి ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతిఒక్కరిని అభినందించారు. అడిషనల్‌ ఎస్పీ రజనీష్‌రెడ్డి తొలుత రక్తదానం చేసారు. జక్కంపూడి గణేష్‌ మిత్ర బృందం, జైన్‌ సేవా సమితి అధ్యక్షులు విక్రమ్‌ జైన్‌తో పాటుగా నగరంలోని వివిధ విద్యాసంస్ధల వారు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దఎత్తున విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొని రక్తదానం చేశారు. అడిషనల్‌ ఎస్పీ ఆర్‌.గంగాధరరావు, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అబ్దుల్‌ కలాం ఆశయాలు సాధిద్దాం

యాంకర్‌ చోటూ ఆధ్వర్యంలో  విగ్రహావిష్కరణ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 17 : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, దేశం గర్వించదగ్గ ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎపిజె అబ్దుల్‌ కలాం యువతకు మార్గదర్శకులని పలువురు వక్తలు పేర్కొన్నారు. యాంకర్‌ చోటూ కృషితో స్ధానిక నందం గనిరాజు జంక్షన్‌ వద్ద ఏర్పాటుచేసిన అబ్దుల్‌ కలాం విగ్రహాన్ని మేయర్‌ పంతం రజనీ శేషసాయి ఈరోజు మధ్యాహ్నం  ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర శాసనభ్యులు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎంఎల్‌సి కందుల దుర్గేష్‌, సిసిసి ఎండి పంతం కొండలరావు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యల గోపి, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, స్ధానిక కార్పొరేటర్‌ తలారి ఉమాదేవి, రాజమహేంద్రి కళాశాల కరస్పాండెంట్‌ టికె విశ్వేశ్వరరెడ్డి, ఆదిత్య విద్యాసంస్ధల డైరెక్టర్‌ ఎస్‌పి గంగిరెడ్డి తదితరులు మాట్లాడారు. అబ్దుల్‌ కలాం ప్రముఖ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. ప్రపంచదేశాలల్లో భారతదేశాన్ని తలెత్తుకుని నిలబడే విధంగా నిలిపిని శాస్త్రవేత్తలలో కలాం ఒకరన్నారు. కలాం దేశ యువతకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి సాధన చేయండి అని కలాం చెప్పిన మాటలను యువత గుర్తించుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించాలన్నారు. రాష్ట్రంలోనే అబ్దుల్‌ కలాం తొలి విగ్రహాన్ని రాజమహేంద్రవరం నగరంలో ఏర్పాటుకు కృషిచేసిన చోటూను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ విద్యాసంస్ధల నుంచి అరిగెల బాబూనాగేంద్రప్రసాద్‌, అసదుల్లా అహ్మద్‌, అబ్దుల్లా షరీఫ్‌, ఎండి కరీంఖాన్‌, తలారి భగవాన్‌, మళ్ళ వెంకట్రాజు, గరగ మురళీకృష్ణ, మెగా చౌదరి, వైసిపి నగర ప్రధాన కార్యదర్శి దంగేటి వీరబాబు, కార్పొరేటర్‌లు మజ్జి నూకరత్నం, గరగ పార్వతి, బీసీ నాయకులు మేరపురెడ్డి రామకృష్ణ, ఖాసిం,  తదితరులు పాల్గొన్నారు.

గర్జనను  విజయవంతం చేద్దాం

బీసీ కార్పొరేటర్‌ల సమావేశం నిర్ణయం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 17 : ఈ నెల 22న స్ధానిక మార్గాని ఎస్టేట్‌లో నిర్వహిస్తున్న బీసీ  గర్జనను విజయవంతం చేయడానికి తమవంతు కృషి చేయాలని బీసీ  కార్పొరేటర్‌ల సమావేశంలో నిర్ణయించారు. బీసీ  సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో ఈ రోజు స్ధానిక ఆనం రోటరీ హాలులో బీసీ  కార్పొరేటర్‌ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్‌లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మి, మజ్జి నూకరత్నం, ద్వారా పార్వతి సుందరిలతో పాటుగా తంగేటి సాయి, రెడ్డి సతీష్‌లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ  సంఘాల సమాఖ్య ఛైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, నగర గౌడ, శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు రెడ్డి రాజు, నాయకులు మార్గాని రామకృష్ణగౌడ్‌, గోలి రవి, దొమ్మేటి సోమశంకర్రావు, కట్టా సూర్యప్రకాశరావు, పేర్ని నూకరాజు, అత్తిలి రాజుపూలే, ఆర్‌వి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. 22న జరిగే గర్జనకు నగర స్ధాయిలో జనసమీకరణకు బాధ్యత తీసుకోవాలని సంఘ నేతలు కార్పొరేటర్‌లను కోరారు. బీసీ గర్జన విజయవంతం చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని కార్పొరేటర్‌లు వెల్లడించారు.

నాగులచెరువు వద్ద త్వరలో మార్కెట్‌ ప్రారంభం : గోరంట్ల 

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 17 : ప్రజలకు నిత్యావసర వస్తువులు(కూరగాయలు) అందుబాటులో ఉండేవిధంగా నాగులచెరువు ప్రాంతం వద్ద మార్కెట్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజు, కార్పొరేషన్‌్‌ సిబ్బందితో కలిసి గోరంట్ల నాగులచెరువు ప్రాంతాన్ని, మున్సిపల్‌ స్టేడియం ప్రాంతాన్ని, అజాద్‌చౌక్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగులచెరువు ప్రాంతం వద్ద కూరగాయలు, చేపలు, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండే విధంగా త్వరలో మార్కెట్‌ ప్రారంభిస్తామని అయన తెలిపారు. మున్సిపల్‌ స్టేడియం పరిశీలించిన అనంతరం అక్కడ జరిగే కార్యక్రమాల సమయంలో వాహనాల రద్దీని తట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆధికారులకు  సూచించారు. అ ప్రాంతంలో వర్షాకాల సమయంలో డ్రైనేజి వ్యవస్ధకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మురుగునీరు పారే విధంగా చర్యలు తీసుకోవాలని  సూచించారు.అజాద్‌చౌక్‌ ప్రాంతాన్ని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా, అవసరానికి అనుగణంగా రోడ్డు వైడింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌తో చర్చించారు. ఈ పర్యటనలో డిప్యూటి కమిషనర్‌ యం.వి.డి ఫణిరామ్‌, యస్‌.ఇ ఓంప్రకాష్‌, ఇ.ఇ కోటేశ్వరరావు, డి.ఇ. వీరభద్రరావు, తదితర శాఖల ఆధికారులు ఈ  పాల్గొన్నారు.

పథకాలను సద్వినియోగపరుచుకోండి

18వ డివిజన్‌లో ఇంటింటికీ తెలుగుదేశం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 17 : తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక 18వ డివిజన్‌లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని కార్పొరేటర్‌ మానుపాటి తాతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్లతోపాటు మేయర్‌  పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్ళి తెదేపా ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించి కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఆదిరెడ్డి వాసు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గరగ పార్వతి, పాలిక శ్రీను, పార్టీ నాయకులు  యేలూరి వెంకటేశ్వరరావు, మేరపురెడ్డి రామకృష్ణ, గరగ మురళీకృష్ణ, జాలా మదన్‌, మహబూబ్‌ జానీ, పుట్టా సాయిబాబు, వెలమ దుర్గాప్రసాద్‌, సూరంపూడి శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.