అశ్వమేథ యాగం

మనస్సాక్షి  – 1049
చాలా సంవత్సరాల మాట… గిరీశం చక్రవర్తి గారు పరిపాలిస్తున్న రోజులవి. ఆయన పాలనలో  ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆరోజు గిరీశం చక్రవర్తి గారు సభలో  కొలువుదీరి ఉన్న ప్పుడు ఆస్థాన పండితుడు ఆచార్యుల రావడం జరిగింది. కొంచెం సేపు మాటలు అయింతర్వాత ” మహాప్రభూ…మీకో మనవి.. మీరు అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుందనిపిస్తుంది” అన్నాడు. దానికి గిరీశం ” అదెందుకు ఆచార్యా… మనం యిప్పటికే ఎన్నో రాజ్యాల్ని జయించేశాం కదా…” అన్నాడు. ఆచార్యులు తలూపి ” అవును మహా ప్రభూ…అయితే అక్కడక్కడా యింకా శత్రువులు తలెత్తుతున్నారు. వాళ్ళందర్ని ఏరిపారేయెచ్చు. యింకా మన విజయ ప్రాభవం అందిరికీ తెలు స్తుంది. పుణ్యం, పురుషార్థం అన్నాడు. యిదేదో గిరీశం చక్రవర్తికి నచ్చేసింది. దాంతో  యింకేం వాదించకుండా ఒప్పేసుకున్నాడు. అంతలో ఆచార్యులు ” మహాప్రభూ.. యాగాశ్వం వెంట  మన సేనాని వెంకూజీని పంపితే బాగుంటుంది” అన్నాడు. గిరీశానికి అది సరయిన నిర్ణయం అనిపించింది. అంతే కాదు. ఆ వెంటనే  ఆ యాగమేదో మొదలవడం, యాగాశ్వం వెంట సేనాని వెంకూజీని పంపడం జరిగింది.దాదాపు నెల గడిచిపోయింది. అన్ని రోజుల పాటు వెంకూజీ  నుంచి  ఎలాంటి సమాచారం లేదు. సరిగ్గా ముఫ్పై అయిదోరోజు వెంకూజీ తిరిగొచ్చాడు. అంతే కాదు. తనతో పాటు చీని చీనాంబరాలూ, యింకా ఎన్నో విలువయిన వస్తువులూ తెచ్చాడు. వెంకూజీ రాకతో గిరీశం చక్రవర్తి చాలా ఆనందపడ్డాడు. ”ఏం వెంకూజీ యిదేనా రావడం? అన్నాడు. వెంకూజీ తలూపి ” అవును మహాప్రభూ… మనకి జయం…జయం… పాటలీపుత్రాన్ని  జయించి వచ్చా” అన్నాడు. దాంతో గిరీశం చక్రవర్తి చాలా ఆనందించి  ”శభాష్‌ వెంకూజీ… నువ్వేదయినా సాధించగలవని నాకు తెలుసు. ఈసారి ఉత్తర భారతదేశం వైపు కాకుండా దక్షిణ భారతం వైపు వెళ్ళు ” అన్నాడు. వెంకూజీ తలూపి ” అలాగే ప్రభూ… యిప్పటికే దక్కను పీఠభూమిలో కొంచెంగా అడుగు పెట్టడం జరిగింది.  యిక మీదట చోళ, పాండ్ర, చేర రాజ్యాల్ని  మన ఆధీనంలోకి తెస్తా” అన్నాడు. గిరీశం అలాగే అన్నట్లుగా తలూపాడు. అలుపెరుగని వెంకూజీ ఆ మర్నాడే యాగాశ్వంతోనూ, కొంత సైన్యంతోనూ బయలుదేరాడు.
అఅఅఅ
వెంకటేశం ఉన్నట్టుండి లేచి కూర్చున్నాడు. అంతా కల…! యింకా గురువుగారి జాడలేదు. ‘యిదేంటీ… యిలాంటి కలొచ్చింది. అను కుంటూ ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనల్లోనే మళ్ళీ నిద్రలోకి జారుకోవడం, అందులో యింకో కల రావడం జరిగాయి
అఅఅఅ
వెంకటేశం వెళ్ళి అలకపాన్పు  ఎక్కేశాడు…! అంటే దానర్ధం ఏ కానుక కోసమో అత్తవారింట్లో అలక పాన్పు ఎక్కడం కాదు. గురువు గారి మీద అలిగి ఆ యింట రుగు మీదే తిష్ఠ వేశాడు…. దాంతో గిరీశం ” ఏవివాయ్‌ వెంకటేశం… యిప్పుడే మయిందని… ఈ బోడి అలకలేటంట?” అన్నాడు. దాంతో  వెంకటేశం ” ఆ యింకా నాకీ  పరిస్థితి ఎన్నిరోజులు గురూగారూ” అన్నాడు. దాంతో గిరీశం” యిదిగో … ఈ విషయంలో మీ తాత వెంకటేశం లక్షణాలు నీలో  బాగా దిగబడ్డాయోయ్‌… ఆయనా యింతే. అలాగే చీటికీ మాటికీ అలిగేయడం…సర్లే..సర్లే… యిప్పుడే నీ కోసం మాట్లడతా” అన్నాడు. దాంతో వెంకటేశం సంబరంగా తలూపాడు. ఈసారి గిరీశం ” ఓ సారి చిన్నప్పటి రోజుల్లోకెళ్ళు” అన్నాడు. వెంకటేశం ఓ సారి చిన్నప్పటి రోజుల్ని  గుర్తు చేసుకుని ” అవును గురూ గారూ…నిక్కరు వేసుకుని శాఖ కెళ్ళేవాళ్ళం కదా”  అన్నాడు. గిరీశం తలూపి ” అవునోయ్‌… అందుకే నిన్ను మళ్ళీ శాఖకే పంపించేద్దామనుకుంటున్నా. మోడీ గారితో మాటా డతా” అన్నాడు. దాంతో వెంకటేశం అదిరిపోయి ” ఏంటీ…మోడీ గారితోనా? ” అన్నాడు. గిరీశం నవ్వేసి ‘ ‘ మోడీ కాకపోతే ఆయన పియ్యేతో మాట్లాడతా” అన్నాడు. మూడోరోజు ఉదయానికల్లా వెంకటేశం మోడీగారి పియ్యే కృష్ణ మాధవ్‌ దగ్గరున్నాడు. కృష్ణ మాధవ్‌కయితే వెంకటేశం వాలకం, మాట తీరూ నచ్చాయి. ” ఏవయ్యా… యింతకు ముందు శాఖలో పనిచేశా వంటకదా. యిప్పుడు మళ్ళీ శాఖలోకి వెళతావా? అన్నాడు. దాంతో వెంకటేశం ఆ..ఊ.. అన్నట్టుగా నసిగాడు. దాంతో కృష్ణ మాధవ్‌ ‘ ‘ సర్లే శాఖంటే పూర్తిగా సర్వీస్‌ ఓరియంటెడ్‌. రాజకీయాల్లో ఎద గాలనుకుంటే  కుదరదు. ఓ పని చేద్దాం నిన్ను పార్టీలోకే పంపించేస్తాలే” అన్నాడు. దాంతో వెంకటేశం మొహం వెలిగి పోయింది. యింతలో కృష్ణమాధవ్‌ ” అవునూ… యింతకీ నువ్వేం చదివావ్‌? అన్నాడు. దాంతో వెంకటేశం పులయి పోయాడు. ” ఎంబిఏ చదివా. యింకా ‘లా’ చేశాను. ఎమ్మెపోలి టిక్స్‌ కూడా అయింది. అన్నీ మన ఆంధ్రా యూనివర్శిటీ నుంచే చేశా అన్నాడు.  కృష్ణమాధవ్‌ తలూపి ‘ వెరీగుడ్‌. అయితే  నాక్కా వలసింది నీ చదువు కాదు. నువ్వు ‘పంచతంత్రం’ చదివావా అన్నాడు. దానికి వెంకటేశం ‘పంచతం త్రమా…అంటే ఆ నక్కలూ,ఏనుగులూ లాంటి జంతువుల కథలుంటాయి. అదే కదా” అన్నాడు. దాంతో కృష్ణ మాధవ్‌ ‘అవునదే. వాటిని చిన్న ప్పుడు ఎప్పుడో చదివుంటావ్‌. ఓ రెండు నెలల టైం తీసుకుని ఆ కథలని బాగా వంటబట్టించుకునిరా. దాంతో పాటు చాణుక్యుడి అర్ధశాస్త్రం కూడా వంటబట్టించు కునిరా” అన్నాడు. ‘యిదేంటీ… ఈ పాత చింతకాయపచ్చడి వ్యవ హారం ఏంటీ’ అనుకుంటూ  బయటకు నడిచాడు వెంకటేశం.
అఅఅఅ
ఎవరో తట్టి లేపేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. కలంతా చెదిరిపోయింది. ఎదురుగా గిరీశం నొట్లోచుట్టతో నిల బడుతున్నాడు. ” ఏవివాయ్‌ వెంకటేశం…పగటి కలలేవయినా కంటు న్నావా? ” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలలు చెప్పాడు.  ” అయినా ఈ కలలకి అర్ధం ఏంటంటారు ?” అన్నాడు. దాంతో గిరీశం ”ఏవుందోయ్‌..యిదంతా ఆ మోడీ, అమిత్‌ షాల వ్యవ హారపు శైలి” అన్నాడు. వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. యింతలో గిరీశం ‘అవునోయ్‌ మోడీగానీ, షా గానీ  కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి తమ జీవితాలు ధారపోసిన వాళ్ళు. వాళ్ళకి ‘నా’ అనే వ్యక్తిగత జీవితం ఉండదు. వాళ్ళ ఆలోచనా, ఆశయం ఒక్కటే. దేశం బాగుండాలి. ఆ దేశంలో ప్రజలంతా బాగుండాలి. అంతే. దాని కోసం ఏం చేయాలన్నదే వారి నిరంతర పోరాటం. అందులో భాగమే ఈ చేదు మాత్రల్లాంటి నోట్ల రద్దు, జీఎస్టీ వ్యవహారాలు. యివేవో తాత్కా లికంగా ప్రజలకి ఇబ్బంది  కలిగించొచ్చుగాక.  కాని శాశ్వతంగా మధురఫలాల్ని  ప్రజలకు అందిస్తాయి. యిదేదో ప్రజలూ అర్ధం చేసుకోగలిగారు. యిటీవల కాలంలో  వేర్వేరు చోట్ల జరిగిన ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణ. అయతే మోదీ, షాలు తలపెట్టిన  ఈ మహత్తర యజ్ఞం సాగాలంటే తమ పార్టీ యిప్పుడే కాదు. మరిన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగాలి. యింకా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ  తమ ప్రాబల్యం విస్తరించుకోవాలి. అందుకే షా ఒక్కొ రాష్ట్రంలోనూ కమలాన్ని వికసింపజేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే మిత్రలాభం, మిత్రబేధం యింకా చాణుక్య నీతి ప్రయోగించడం. యివన్నీ పక్కనబెడితే ఓ విషయాన్ని  ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. అది…దశాబ్ధాలుగా దాదాపు అన్ని ప్రభుత్వాల హయాంలోనూ వేల కోట్లు రూపాయల స్కాంలు జరిగాయి. అయితే గత మూడేళ్ళుగా ఒక్క మంత్రి మీద కూడా అవినీతి ఆరోపణ రాకపోవడం ప్రజలకి ఎంతో శుభపరిణామం. అంతే కాదు. దేశంలో అవినీతి ప్రక్షాళన కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఈ  లెక్కన రాబోయే రెండేళ్ళలో  దేశం మరింత స్వచ్ఛత వైపు వెళ్ళడం ఖాయం ” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

గిల్లుడు

మనస్సాక్షి  – 1048
 
ఉన్నట్టుండి వెంకటేశం ఎడమకన్ను అదిరింది. దాంతో వెంకటేశంలో టెన్షన్‌ మొదలయింది. వెంకటేశం తెగ చదువుకున్నాడో, యింకా బోల్డన్ని లాజిక్కులు మాట్లాడేవాడూ అయ్యండొచ్చుగాక.. అయినా  యిలాంటివంటే భయమే. పెరిగిన వాతావరణం అలాంటిదాయె. దాంతో ఏం కొంప లంటుకుంటాయో అనుకుంటూ గిరీశం గారిం ట్లోకి దూరాడు. అయితే ఆపాటికి యింట్లో గిరీశం లేడు. బాబీగాడు మాత్రం టీవీ చూస్తు న్నాడు. వెంకటేశం రావడం చూడగానే ‘బాబాయ్‌’ అంటూ పరిగెత్తుకు వచ్చాడు. వెంకటేశం వాడిని దగ్గరగా తీసుకుని ”ఏరా.. మీ మావయ్య ఎక్కడ్రా?” అన్నాడు. బాబీగాడు తల అడ్డంగా ఊపి ”ఏమో తెల్దు బాబాయ్‌.. ఏదో ఊరెళ్ళాడు” అన్నాడు. గిరీశం ఎక్కడికెళ్ళాడన్నది వెంకటేశానికి అర్థం కాలేదు. అంతలోనే  ఆరోజు ఆఖరి ఆదివారమని గుర్తొచ్చింది. దాంతో గిరీశం ఎక్కడికెళ్ళాడో అర్థమయిపోయింది. నెలలో ఆఖరి ఆదివారంనాడు భీమవరం దగ్గరున్న వేండ్రలో కోడిపందేలు జరుగుతుంటాయి. అదీ ఆ ఊరి చివర తోటల్లో. పండగలకీ, పబ్బాలకీ సంబంధం లేకుండా ఈ వ్యవహారం ఎప్పట్నుంచో జరుగుతోంది. యిక్కడుండి చేసేదేం ఉందని వెంకటేశం కూడా ఎర్రబస్సెక్కి ఆ ఊరు బయల్దేరాడు. మొత్తానికి యింకో మూడుగంటల తర్వాత వెంకటేశం వేండ్రలో దిగడం, అక్కడ్నుంచి ఆ కోడిపందేలు జరుగుతున్న తోటలోకి వెళ్ళడం జరిగాయి. ఆపాటికి గిరీశం మిగతావాళ్ళతో కలిసి  కోడి పందేల జోరులో ఉన్నాడు. అక్కడ ఓ అరగంట ఉండేసరికి వెంక టేశానికి బోరు కొట్టేసింది. దాంతో ఊళ్ళోనే ఉన్న తన స్నేహితుడి యింటికి వెళ్ళిపోయాడు. అదే మంచిదయింది. యింకో గంట తర్వాత కోడిపందేల రాయుళ్ళని పోలీసులు పట్టుకున్నారన్న వార్త ఊరంతా గుప్పుమంది. దాంతో వెంకటేశం ఆదరాబాదరా పోలీస్‌స్టేషన్‌కి పరి గెత్తాడు. ఆపాటికి గిరీశం సహా అంతా సెల్‌లో ఉన్నారు.
 
అఅఅఅ
 
యింకా మీడియాపక్షులికి ఉప్పందినట్టు లేదు. ఎవరూ లేరు. యింతలోనే ఎస్సై బయట నుంచి వచ్చాడు. తీరా సెల్‌లో ఉన్న గిరీ శాన్ని చూసి  ”అరెరె.. మీరా గిరీశం గారూ.. మిమ్మల్నిలా కలుసు కోవడం ఏదోలా ఉందనుకోండి. సరే.. జరిగిందేదో జరిగిపోయింది.  వెళ్ళిపోండి” అంటూ వారందరినీ విడుదల చేయించేశాడు. దాంతో గిరీశం ”మరి కేసదీ..” అన్నాడు. దాంతో ఎస్సై నవ్వేసి ”కేసేటండీ కేసు.. కోళ్ళకి బలవర్ధకమైన ఆహారం గురించి సూచనలు చేయ డానికి మీరొచ్చారనీ, వాటి శక్తి సామర్ధ్యాలు పరీక్షిస్తున్నారనీ, వీళ్ళంతా ఆ కోళ్ళ యజమానులనీ రాసుకుంటాం. అంతే. యింకే కేసూ ఉండదు” అన్నాడు. దాంతో గురుశిష్యులిద్దరూ మనస్ఫూర్తిగా ఎస్సైకి నమస్కారం పెట్టి బయటకొచ్చేశారు.
 
అఅఅఅ
 
వెంకటేశం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అంతా కల..! ‘యిదేంటీ… యిదేదో నాగయ్యగారి కాలంనాటి కలలా ఉందేంటీ..’ అను కున్నాడు. అటూ యిటూ చూస్తే  యింకా గురువుగారి జాడలేదు. దాంతో యింట రుగు మీదే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి యింకో కలొచ్చింది.
 
అఅఅఅ
 
”ఏరా బాబీ.. మీ మావయ్య ఏడిరా?” అన్నాడు వెంకటేశం వస్తూనే. ఆపాటికి టీవీ ఛానల్స్‌ మార్చుకుంటున్న  బాబీ ”ఊరె ళ్ళాడు బాబాయ్‌.. సాయంత్రం వసా ్తనన్నాడు” అన్నాడు. గురువుగారు ఎక్కడి కెళ్ళుంటారా అని వెంకటేశం ఆలోచిస్తుంటే టీవీలో ఏదో ఫ్లాష్‌ న్యూస్‌ రావడం మొద లయింది. ఈలోగా వేండ్రలో కోడి పందేలు ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారనీ. వారిలో రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యక్తి గిరీశం ఉన్నారన్నది’ ఆ వార్త. అది చూడగానే వెంకటేశం షాకయ్యాడు. ఏం చేయాలా అని ఆలోచించాడు. అంతలోనే ఓ నిర్ణయానికి వచ్చి నట్టుగా ఎవరెవరికో ఫోన్లు చేసి, ఆనక ప్రెస్‌క్లబ్‌కి పరిగెత్తాడు.. యింకో గంటలో ఆ ప్రెస్‌మీటేదో మొదలయింది. వెంకటేశం ఆవేశంగా మాట్లాడుతున్నాడు. వెంకటేశం చెప్పేది అందరూ రాసు కుంటున్నారు. ‘యిదెంత దారుణమని.. గిరీశం గారి లాంటి సంఘ సంస్కర్తలంటే ఆ ఎస్సైకి పడదని అర్థమయిపోతోంది. ఏం.. కోడిపందేలు ఆడేవాళ్ళు లక్షల్లో ఉంటారు. వాళ్ళందరినీ అరెస్ట్‌ చేసి జైల్లో పడేస్తారా.. అలా అయితే జైళ్ళు సరిపోతాయా.. అసలిదంతా ఏదో కక్ష సాధింపు చర్యలా ఉంది. లేకపోతే అంత మహా మేధావి అయిన గిరీశం గారిని అరెస్ట్‌ చేయడమేంటీ?” అన్నాడు. వెంకటేశం చెప్పిందంతా మీడియాలో ప్రముఖంగా వచ్చింది. యిది జరిగిన రెండు గంటల తర్వాత వెంకటేశం వేండ్ర బయల్దేరాడు. అక్కడ పోలీస్‌స్టేషన్‌కి చేరుకున్నాడు. వెంకటేశం వెళ్ళేసరికి గిరీశం, యింకో అయిదుగురూ దేభ్యం మొహాలేసుకుని సెల్‌లో ఉన్నారు. ఎస్సై అయితే  స్టేషన్‌లోనే  ఉన్నాడు.  వెంకటేశం గబగబా ఎస్సై దగ్గరికి నడిచి తనని పరిచయం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఎస్సై మొహంలో మార్పొచ్చింది. కొంచెం క్రూరంగానే ”అయితే టీవీలో స్టేట్‌మెంట్లు యిచ్చిన వెంకటేశం నువ్వేనన్నమాట” అన్నాడు. వెంక టేశం అవునన్నట్టుగా తలూపాడు. దాంతో ఎస్సై చెలరేగిపోయాడు. గిరీశం వైపు తిరిగి ”కోడిపందేల బాపతు యితని దగ్గర పట్టుబడింది లక్షరూపాయలు” అన్నాడు. దాంతో గిరీశం కంగారుగా ”సార్‌.. నా దగ్గరున్నాయి అయిదువేలే. లక్ష నా దగ్గర లేదు” అన్నాడు. అయినా ఎస్సై ఊరుకోలేదు. ”లేదు.. లేదు.. మిగతా వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా దొరకలేదు. మొత్తం డబ్బంతా నీ దగ్గరే ఉంది. అసలు ఈ కోడిపందేలు నిర్వహిస్తున్నది నువ్వేనట కదా” అన్నాడు. ఆపాటికి గిరీశానికి షాక్‌తో మాట పడిపోయింది. యింకా ఎస్సై కొనసాగిస్తూ ”ఆ మధ్యన చైన్‌ స్నాచింగ్‌ టీంలో నువ్వు మెంబర్‌వట. యింకా ఊళ్ళో జరిగిన అరడజను దొంగతనాలు ఓ అత్యాచారం వ్యవ హారంలో నీ పాత్ర ఉందట కదా” అన్నాడు. దాంతో అటు సెల్‌లో గిరీశం, సెల్‌ బయట వెంకటేశం పెద్దగా అరిచి కిందపడిపోయారు.
 
అఅఅఅ
 
మొహం మీద పొగ తగిలేసరికి  వెంకటేశం కళ్ళు తెరిచాడు. తీరా చూస్తే ఎదురుగా గిరీశం..! ”ఏవివాయ్‌ వెంకటేశం.. పగటికలలేవో కంటున్నట్టున్నావ్‌..” అన్నాడు. వెంకటేశం తలూపి ”గురూగారూ.. కొంపదీసి మీరు జైలుకి వెళ్ళిపోతారంటారా?” అన్నాడు.  దాంతో గిరీశం విసుక్కుని ”వెధవ ఆశలేం పెట్టుకోకుండా విషయమేంటో చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలలన్నీ చెప్పాడు. అంతా విన్న గిరీశం ”అయితే ఈసారి నీకలలో ఆర్జీవీ.. అదే.. రాం గోపాల్‌వర్మ దూరినట్టుంది” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టు చూశాడు. అప్పుడు గిరీశం కొంచెం వివరంగా చెప్పడం మొద లెట్టాడు. ”మరేం లేదోయ్‌.. ఎక్కడే సమస్యున్నా ట్విట్టరు ద్వారా అక్కడ వాలిపోవడం ఆర్జీవీకి అలవాటు. అంటే అదేదో ఆ సమస్య పరిష్కరించడానికి కాదు. కామెంట్స్‌ చెయ్యడానికి  దాంతో చాలా సార్లు విమర్శల పాలవడం కూడా జరిగింది. భావ వ్యక్తీకరణ తప్పు కాదు. ఈసారి ఆర్జీవీ డ్రగ్స్‌ మీద పడ్డాడు. తన శిష్యుడయిన పూరీలాంటి వాళ్ళని కాపాడే ఉద్దేశ్యం కావచ్చును. సిట్‌ అధికారుల మీదా, అకున్‌ మీదా విమర్శలు గట్టిగానే చేశాడు.  స్కూలు పిల్లల్ని కూడా యిలాగే పన్నెండేసి గంటలు విచారిస్తాంరా.. డ్రగ్స్‌ విషయంలో సినిమావాళ్ళనే ఎందుకు టార్గెట్‌ చేశారు.. ఈ విషయంలో సిట్‌ చేస్తున్నదేం బాలేదు’ లాంటి వ్యాఖ్యానాలు చేశాడు. అయితే దీని వలన ఆ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళకి ఏదో మంచి జరగడం మాట దేవుడెరుగు.. సమస్య మరింత జఠిల మయ్యే  ప్రమాద ముంది. ఏతావాతా చెప్పేదేంటంటే.. ఏ విషయం మీదయినా ప్రతి స్పందించే  హక్కు ఆర్జీవీకి ఉండొచ్చుగాక. అయితే  యిలాంటి కీలక అంశాలపై మాట్లాడకపోవడమే మంచిది. అలా మాట్లాడడం వలన అటు సిట్‌ అధికారుల నుంచే కాకుండా, యిటు సొంత యిండస్ట్రీ నుంచి కూడా అక్షింతలు పడతాయి” అంటూ వివరించాడు.
 
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి  

ఆర్జిత సేవ అనే జీతగతం

మనస్సాక్షి  – 1047
వెంకటేశం కొంచెం టెన్షన్‌గా ఉన్నాడు. అసలే యిప్పుడు మాట్లాడబోయేది మామూలు వ్యక్తితో కాదాయె. రాస్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిగారితో. గురువుగారు ఏ స్థాయిలో ఎవర్ని మేనేజ్‌ చేశారో ఏంటో మొత్తానికి సీఎంగారి దగ్గరకి తనని పంప గలిగారు. యింతలోనే లోపల్నుంచి పిలు పొచ్చింది. దాంతో వెంకటేశం గబగబా లోపలికి నడిచాడు. అయితే  లోపల వాతావరణం అంత టెన్షన్‌గా లేదు. బాబుగారయితే ”ఆ..రావోయ్‌ మిస్టర్‌ వెంకటేశం.. నీ గురించి మీ జిల్లా నుంచి మూడు నాలుగు ఫోన్లొచ్చాయి. ఊ..యిప్పుడు చెప్పు ఎందుకొచ్చావో?” అన్నాడు. దాంతో వెంక టేశం హుషారుగా ”ఏం లేద్సార్‌.. నాకు ఎప్ప ట్నుంచో రాజకీయాలంటే యింట్రెస్ట్‌. అందు లోనూ మీరంటే నాకు చాలా అభిమానం. మీ దగ్గరుండే ఎడ్వైయిజరీ కమిటీలో చేరాలనుంది” అన్నాడు. దాంతో చంద్రబాబు నవ్వేసి ”యిప్పటికే ఆ కమిటీలో చాలామంది మేధావు లున్నారు. కొత్తగా నువ్వొచ్చి చేసేదేముంటుంది?” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. తన మేధోతనం ఏదో నిరూపించు కోవలసిన పరిస్థితి ఏర్పడింది. యింతలోనే బాబు ”సరే.. ఒకటి చెప్పు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అది తగ్గించాలంటే  వాళ్ళకి ఉద్యోగాలు యివ్వాలి. కానీ యివ్వడానికి అన్ని ఉద్యో గాలేంలేవు. ఒకవేళ అలా యిచ్చినా అందరికీ జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఓ రకంగా ఉన్న ఉద్యోగులకే జీతాలు యివ్వడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో నీ సలహా ఏంటి?” అన్నాడు. దాంతో వెంక టేశం ఆలోచనలోపడ్డాడు. యిప్పుడు తను చెప్పబోయే దాని మీదే తన భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాంతో యింకా తీవ్రంగా ఆలోచిం చడం మొదలెట్టాడు. అప్పుడు తట్టిందా ఆలోచన. ఒక్కసారిగా హుషా రొచ్చేసింది. తనకొచ్చిన ఆలోచనకి తనని తానే అభినందించు కున్నాడు. బాబు వంక తిరిగి ”సార్‌… ఈ నిరుద్యోగుల్లో చాలా మందికి వెంటనే ఉద్యోగం యిచ్చెయ్యండి” అన్నాడు. బాబుకయితే బొత్తిగా అర్థం కాలేదు. ఏవయినా పిచ్చెక్కిందా అన్నట్టుగా వెంకటేశం వైపు చూశాడు. ”ఏంటీ.. ఓ పక్కన ఉన్నా ఉద్యోగస్తులకు జీతా లివ్వలేక ఖజానా ఖాళీ అవుతుంటే కొత్త ఉద్యోగాలెలా?” అన్నాడు. దాంతో వెంకటేశం చిద్విలాసంగా నవ్వి ”ప్రీమియం ఉద్యోగాలు సృష్టిద్దాం సార్‌.. అంటే మరేంలేదు. రకరకాల డిపార్ట్‌మెంట్లలో రక రకాల ఉద్యోగాలు ఉంటాయి. వాటిని యిప్పటికే ఎవరో చేస్తుం టారు. ఉదాహరణకి ఓ పోలీస్‌స్టేషన్లో ఎస్సై పోస్ట్‌ ఉంటుంది. ఆ పోస్ట్‌ అలా ఉండగానే అదే స్టేషన్‌కి యింకో ఎస్సై పోస్టు సృష్టిస్తాం. అయితే ఈ కొత్త ఎస్సై పోస్ట్‌కి మనం జీతాలవీ యివ్వం. అలా జీతాలవీ లేకుండా పనిచేయడానికి యిష్టపడేవాళ్ళనే ఆ పోస్ట్‌లోకి తీసుకుంటాం. అంతేకాదు. ఈ ప్రీమియం పోస్టులకి పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే టెండర్లు పిలిచి దాంట్లో ఎక్కువ గవర్నమెంటుకి యిస్తామన్న వాళ్ళకి ఆ పోస్ట్‌లు యిస్తామన్నమాట. దాంతో ఖజానాకి బోల్డంత ఆదాయం” అన్నాడు. వెంకటేశం చెప్పిం దాంతో అంతటి బాబు కూడా అదిరిపోయాడు. ”అసలిది సాధ్య మేనా? జీతాలు లేకుండా పైగా ఎదురొచ్చి ఈ ప్రీమియం పోస్ట్‌లు కొనుకుంటారంటావా?” అన్నాడు. దానికి వెంకటేశం ”తప్పకుండా సార్‌..” అన్నాడు. తర్వాత బాబు అంగీకరించడం, మిగతా ఏర్పాట్లకి పురమాయించడం జరిగిపోయాయి.
—–
రాష్ట్ర చరిత్రలో గొప్ప సంచలనం రేగింది. రాష్ట్రంలోని అన్ని డిపార్ట్‌ మెంట్లలో, అన్ని స్థాయిలలో యింతకు ముందే ఉన్న పోస్టులకు సమాంతరంగా అదేస్థాయి ప్రీమియమ్‌ ఉద్యోగాలు సృష్టించ బడ్డాయి. యిక ఈ ఉద్యోగాలకి టెండర్లు పిలిచేసరికి కుప్పలు తెప్ప లుగా వచ్చిపడ్డాయి. జీతం ఏదీ రాకపోయినా ఫర్వాలేదంటూ  బోల్డంత రేట్లకి కోట్‌ చేసి మరీ ఆ ప్రీమి యమ్‌ ఉద్యోగాల్లో చేరిపోయారు. యింకే ముంది.. వారం తిరక్కుండా ప్రభుత్వ ఖజానా నిండిపోయింది. రాష్ట్రంలో సగం నిరుద్యోగ సమస్య తీరిపోయింది. యిక ఈ కొత్త ప్రీమియమ్‌ ఉద్యోగస్తులు ప్రతి పనికీ యింతని తీసేసుకుని పనులన్నీ చకచకా చేసి పారేస్తున్నారు. దాంతో వాళ్ళ జేబులూ నిండుతున్నాయి. యింకోపక్క డబ్బులు ఖర్చయినా జనాల పనులు చకచకా పూర్తయి పోతున్నాయి. ఏతావాతా.. అందరూ హేపీ సర్వేజనా సుఖినోభవంతు.
—–
అది గురూగారూ… రాత్రి నాకలాంటి గమ్మ త్తయిన కలొచ్చింది. అయినా ఈ కలేదో బొత్తిగా లాజిక్కు లేనట్టుగా ఉందేంటీ?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”యిందులో అంత ఆశ్చర్యం ఏవుందోయ్‌.. వ్యవస్థ నడుస్తున్న తీరు యిలాగే ఉందిగా” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టుగా చూశాడు. దాంతో గిరీశం ”అవునోయ్‌.. ఆ వెంకన్నబాబు గుడికెడితే ఏం చేస్తాం… మనమే ఖర్చుపెట్టి ఆ భగవంతుడికి ఆర్జిత సేవలు చేస్తాం.. సరే.. ఆ దేవుడి గురించి వదిలెయ్‌. మనల్ని పాలించే దేవుళ్ళనే తీసుకో. అదే మన నాయకుల సంగతిలే. వాళ్ళేం చేస్తారు? కోట్లు ఖర్చుపెట్టి మరీ ఎలక్షన్లో నెగ్గుతారు. ఎందుకంట? ప్రజాసేవ ఎడాపెడా చేసెయ్యడానికా? అవునంటే అవును. కాకుంటే కాదు. ఖర్చు పెట్టిందానికి వందరెట్లు సంపాదించడానికి. కొంతమంది ! అలాగే ఉద్యోగస్తుల విషయం తీసుకున్నా చాలామంది విషయంలో అవి నీతి, లంచగొండితనం చూడొచ్చు. వాళ్ళకి జీతభత్యాలతో పనే లేదు. పై సంపాదనే వారికి ఆక్సిజన్‌. ఒక మామూలు స్థాయి ఉద్యోగి దగ్గర వందకోట్లు దొరకడం, పైస్థాయి అధికారి దగ్గర  వెయ్యి కోట్లు పైగా దొరకడం దానికి ఉదాహరణ. ఏతావాతా మన వ్యవస్థలో మొత్తంగా నడుస్తోంది ఈ ఆర్జిత సేవల వ్యవహారమే” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

జీయస్టీ బ్రహ్మ పదార్థం

మనస్సాక్షి  – 1046
సాయంత్రం కావస్తోంది. ఆపాటికే పార్కులోకి జనాలు చేరుకుంటున్నారు. వారిలో ప్రేమ పక్షులూ ఉన్నాయి. రిటైరయిన పక్షులూ ఉన్నాయి. యింకా గిరీశం, వెంకటేశంలాంటి చర్చల పక్షులూ ఉన్నాయి. గిరీశం, వెంకటేశం అయితే పార్కులో ఓ మూలనున్న బెంచీమీద సెటిలయ్యారు. యింతలోనే  వెంకటేశం ”ఏంటో గురూగారూ.. ఈమధ్య ఎక్కడ చూసినా జీఎస్‌టి గోల ఎక్కు వయిపోయింది. పేపర్లలో సగం వార్తలవే” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ఏదో అనబోయాడు. యింతలో కొంచెం అవతలగా ‘వేడీ..వేడీ.. చనక్కాయలు’ అంటూ అరవడం వినిపించింది. దాంతో వెంకటేశం ఆబగా తలతిప్పి చూశాడు. అసలయితే  ఆ వేరుశనక్కాయల మాటెలా ఉన్నా ఆ ‘వేడీ..వేడీ’ అనడమే ఎక్కువ నోరూరించేలా ఉంది. దాంతో వెంకటేశం ఆ శాల్తీని పిలిచేశాడు. తర్వాత గిరీశం వైపు తిరిగి ”గురూగారూ.. మీరూ తింటారు కదా” అన్నాడు. గిరీశం తలూపాడు. ఈలోగా ఆ వేరుశనక్కాయలవాడు రెండు పొట్లాల వేరుశనక్కాయలు యిద్దరికీ  యిచ్చాడు. వెంకటేశం జేబులోంచి ఓ యిరవై రూపాయలు తీసిచ్చాడు. అయితే అప్పుడో గమ్మత్తు జరిగింది.  అతగాడు అది తీసేసుకుని ”మరి జీఎస్‌టి యివ్వరా” అన్నాడు. దాంతో గురుశిష్యులిద్దరూ అదిరిపోయారు. వెంకటేశం అనుమానంగా ”ఏంటీ… వేరుశనక్కాయులకి జీఎస్‌టీనా..!” అన్నాడు. అతగాడు ఏమాత్రం తగ్గకుండా ”అవును బాబూ.. ఫుడ్‌ ప్రోడక్ట్‌ల మీద 28 శాతం జీఎస్‌టీ తెలుసా.. మరిది ఫుడ్‌ ప్రోడక్టే కదా. మామూ లుగా అయితే  మీరు కొన్న దానికి జీఎస్‌టి అయిదూ అరవై పైసలు. ఏదో తెలుసున్నవాళ్ళు కదా. ఓ అయిదు రూపాయలివ్వండి చాలు” అన్నాడు. అప్పటికే షాక్‌లో ఉన్న వెంకటేశం ఓ అయిదు రూపా యలు అతగాడి చేతిలో పెట్టాడు. యింకో పావుగంట తర్వాత గురుశిష్యులిద్దరూ పార్కు నుంచి బయటకొచ్చారు. ఆపాటికి కొంచెం చీకటి పడుతోంది కూడా. యింతలో యింకో తమాషా జరిగింది. వాళ్ళలా పార్కు గేటులోంచి బయటికొచ్చారో లేదో గేటు పక్కనున్న బిచ్చగాడు ”ధర్మం సెయ్యండి బాబయ్యా” అంటూ చేయి చాపాడు. వెంకటేశం ఓసారి జేబులు వెతికి ఓ రూపాయి కాసు బయటికి తీసి ఆ బిచ్చగాడి చేతిలో పెట్టి పండగ చేసుకో అన్నట్టుగా చూశాడు. అయితే ఆ బిచ్చగాడు ఆ రూపాయేదో వెనక్కిచ్చేస్తూ ”ఏంటి బాబయ్యా.. రూపాయి ధర్మం చేసేసి డైరెట్టుగా సోర్గానికి ఎల్లి పోదావనుకుంటున్నావా… పది రూపాయలన్నా ధర్మం చేయాల్సిందే” అన్నాడు. దాంతో గురుశిష్యులిద్దరూ నోరెళ్ళబెట్టారు. యింతలో ఆ బిచ్చగాడు ”అవును బాబయ్యా… మా సంఘపోళ్ళే పదిరూపాయలకి తక్కువ తీసుకోవద్దని నిర్ణయించారు” అన్నాడు. దాంతో వెంకటేశం ఏడ్చుకుంటూ ఆ రూపాయి వెనక్కి తీసుకుని బొచ్చెలో పదిరూపాయలు వేశాడు. అయినా వాడు కదల్లేదు. ”ధర్మం చేశారు బానే ఉంది. మరి జీఎస్‌టి సంగతేంటి బాబయ్యా..” అన్నాడు. దాంతో వెంకటేశం కోపంగా ”ఏంటీ.. దీనిక్కూడా జీఎస్‌టీనా?” అన్నాడు. బిచ్చగాడు తలూపి ”అవును బాబయ్యా… ఓ మూడు రూపాయలు జీఎస్‌టీ కింద యిప్పించండి” అన్నాడు. గిరీశం అయితే జరిగేదంతా నవ్వుతూ చూస్తున్నాడు. వెంకటేశం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమీతుమీ తేల్చేసుకునే పనిలో పడ్డాడు. ”యింతకీ నువ్వా జీఎస్‌టీ కడుతున్నావా?” అని అడిగాడు. దానికా బిచ్చగాడు ”నేను డైరెట్టుగా కట్టను బాబయ్యా. మరి ఏం కొనుక్కున్నా అన్నిటిమీదా జీఎస్‌టీ కడుతున్నా కదా” అన్నాడు. యింకేముంది… ఆ బిచ్చగాడి లాజిక్‌తో బుర్ర పాడయిపోయిన వెంకటేశం యింకేం మాట్లాడకుండా బొచ్చెలో యింకో మూడు రూపాయలూ వేసేసి బయల్దేరాడు. అక్కడ్నుంచి యింకో పావుగంటలో గిరీశం గారింటికి చేరుకున్నారు.  యింటికెళ్ళేసరికి గుమ్మంలోనే గిరీశం మేనల్లుడు బాబీగాడు ఎదురయ్యాడు. వాడు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. దాంతో గిరీశం మనసేదో కీడు శంకించింది. యింతలో బాబీగాడు ”మావయ్యా.. నేను పిక్నిక్‌కి వెడుతున్నా. డబ్బులివ్వవా..” అన్నాడు. గిరీశం తలూపి ”అలాగే యిస్తాగానీ.. ఎంత?” అన్నాడు. వాడేవో లెక్కలేసుకుని ”మినిమమ్‌ రెండొందలు. ఆపైన నీ యిష్టం” అన్నాడు. దాంతో గిరీశం ”నేన ెప్పుడూ మినిమమే యిస్తా కదరా” అంటూ ఓ రెండొందలు తీసిచ్చాడు. అది తీసేసు కునివాడు” మరి జీఎస్టీ మావయ్యా” అన్నాడు. దాంతో గిరీశం అదిరిపోయి ”ఏంట్రా… జీఎస్టీనా..” అన్నాడు. వెంకటేశం మాత్రం వస్తున్న నవ్వునాపుకుంటూ దీన్నంతా చూస్తున్నాడు. యింతలో బాబీగాడు ”అవును మావయ్యా… అందరూ అంటున్నారు కదా. అందుకే నేనూ అడిగేశా” అన్నాడు. దాంతో గిరీశం కయ్యిమని ”తంతా వెధవాని..” అంటూ మీదకొచ్చాడు. దాంతో ఎందుకయినా మంచిదని బాబీగాడు తుర్రుమన్నాడు. ఈసారి వెంకటేశం గట్టిగానే నవ్వడం మొదలెట్టాడు.
——
మొహంమీద వేడిగా పొగ తగిలేసరికి  వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎదురుగా నోట్లో చుట్టతో గిరీశం నిలబడున్నాడు. ”ఏవివాయ్‌ వెంకటేశం… తెగ నవ్వేసుకుంటున్నావ్‌.. కలలో ఏ సినిమా హీరోయిన్‌తోనయినా గంతులేస్తున్నావా?” అన్నాడు. దాంతో వెంకటేశం నిట్టూర్చి ”ఆ… అంతదృష్టం కూడానా…” అంటూ తనకొచ్చిన కల చెప్పాడు. అంతా విన్న గిరీశం ”అవునోయ్‌.. యిప్పు డంతా జీఎస్టీ హడావిడే కదా. అందుకే యిలాంటి కలొచ్చింది” అన్నాడు. వెంకటేశం అనుమానంగా ”అంటే గురూగారూ… జీఎస్టీ సమస్యాత్మకమయిందా?” అని అడిగాడు. దాంతో గిరీశం నవ్వేసి ”జీఎస్టీ అమల్లో ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే యిండియాలో జీఎస్టీ  ఎక్కువే. అలాగే జీఎస్టీ మీద  అందరికీ యింకా సరయిన అవగాహన రాలేదన్నది నిజం. వీటి వలన ఆ జీఎస్టీని కొందరు భూతంలా చూపించి,  తమ స్వార్ధానికి వాడుకుంటున్నారు. అదే సింబా లిక్‌గా నీ కలలో వచ్చింది. యింకో విషయమేంటంటే… రకరకాల వస్తువుల మీద రకరకాల శ్లాబుల్లో టేక్సులు వేయడం జరిగింది. అయితే తర్వాత వాటిల్లో కొన్నింటికి మార్పులు చేశారు. అయినా ఈ మార్పుల గురించి అవగాహన యింకా అందరికీ రానేలేదు. దాంతో యింతకుముందు ఎక్కువున్న టేక్స్‌లు తగ్గించిన వస్తువుల ధరలు కూడా తగ్గించకుండా అమ్మేస్తున్నారు. యింకో పక్క టేక్స్‌లు పెరిగి పోయాయంటూ చాలా వస్తువుల ధరలు పెంచి మరీ అమ్ము తున్నారు. అందుకే జీయస్టీ అంటే భారం అనే భావం అందరిలో పెరిగిపోయింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే.. జీఎస్టీ వలన అందరూ తాత్కాలికంగా యిబ్బందిపడుతున్నారన్నది నిజం. అయితే  తొందర్లోనే అందరికీ జీయస్టీ గురించి అవగాహన రావడం, అల వాటు పడడం జరుగుతుంది. అయితే ఈ జీఎస్టీ వలన వ్యవస్థ బలో పేతం కావడం, అందరికీ ఆర్థిక లబ్ధి చేకూరడం ఖాయం. అయితే దానికి కొంత సమయం పడుతుంది” అంటూ వివరించాడు. అంతా విన్న గిరీశం ”ఆ.. బాగా చెప్పావోయ్‌.. అఆన్నడు. యింతలో వెంక టేశం ”అవునూ.. ఆ జీఎస్టీ దెబ్బేదో మీ చుట్టకీ పడినట్టుంది.  మానే స్తారా?” అన్నాడు. దాంతో గిరీశం కంగారుపడిపోయి ”అమ్మో.. యింకేవయినా ఉందా.. యిది లేకపోతే నేను లేను. ఏదో ఎడ్జస్టే అవడమే” అన్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

వెన్ను మీద పన్ను

మనస్సాక్షి  – 1045
గిరీశం కాస్తా మంచానపడ్డాడు. ‘నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషన్‌’ అనే గిరీశాన్ని ఓ ఆడదోమేదో బాగా ఎడ్యుకేట్‌ చేసినట్టుంది. అదే… బాగా కుట్టేసినట్టుంది. దాంతో మలేరియాలాంటిదేదో వచ్చేసి హాస్పిటల్లో పడ్డాడు. యింకేముంది. వెంకటేశం ఎడాపెడా సేవలు చేసే పనిలో పడ్డాడు. మొత్తానికి వారం రోజుల తర్వాత గిరీశం కోలుకోవడం, హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ కావడం జరిగింది. ఆరోజు వెంకటేశం ”గురూగారూ.. మీరు కాదనకూడదు. హాస్పిటల్‌ బిల్లు మొత్తం  నేను కట్టేస్తా” అన్నాడు. గిరీశం నవ్వేసి ”అలాగే కానీవోయ్‌.. ఎలాగూ గురుదక్షిణలవీ లేవుగా” అన్నాడు. దానికి వెంకటేశం నవ్వేశాడు. యింతకీ ఆ బిల్లేదో పన్నెండువేలయింది. వెంకటేశం ఆ మొత్తం కట్టేసి బిల్లు తీసుకున్నాడు. యిక అక్కడ్నుంచి బయలుదేరదామనుకుంటుండగా జరిగిందది. గుమ్మం దగ్గర ఓ శాల్తీ ఎదురుపడింది. ”నేనిక్కడ ఆయాను బాబూ” అంది. దాంతో వెంకటేశం ”అలాగా… నేను ఆయన శిష్యుడినిలే” అంటూ పరిచయం చేసుకున్నాడు. దాంతో ఆ శాల్తీ అవన్నీ నాకెందుకన్నట్టుగా చూసి ”మేం ఆరుగురుం బాబూ… పేషంటు డిశ్చార్జ్‌ అయినప్పుడు అందరూ ఎంతోకొంత యిస్తుంటారు” అంది. దాంతో వెంకటేశం జేబులోంచి ఓ వంద రూపాయల నోటు తీసి పండగ చేసుకో అన్నట్టుగా చూసి ఆవిడ చేతిలో పెట్టాడు. అయితే ఆవిడ అంతకంటే రెట్టింపు స్పీడుతో దానిని తిరిగి వెంకటేశం చేతిలో పెట్టేసి ”యిదేదో నువ్వే ఉంచేసుకో బాబూ..” అంది. దాంతో వెంకటేశం బోల్డంత సిగ్గుపడిపోయి యింకో రెండొందలు కలిపి మొత్తం మూడొందలూ యిచ్చాడు. దాంతో ఆవిడ అదేదో తీసుకుని వెళ్ళిపోయింది. వెంక టేశం అక్కడ్నుంచి యింకో నాలుగడుగులు వేశాడో లేదో యింకో శాల్తీ ఎదురయింది. అయితే ఆ శాల్తీ గొంతు కొంచెం దీనంగా ఉంది. ”మేం తోటీలం బాబూ.. హాస్పిటల్‌లోని శుభ్రంగా చేసేది మేమే. మీ సంతోషం కొద్దీ ఎంతో కొంత యివ్వండి” అంది. ఈసారి వె ంకటేశం కొంచెం బుర్ర ఉపయోగించాడు. ”అందరూ ఏమాత్రం యిసా ్తరేంటీ?” అన్నాడు. దానికా తోటీ ”ఆ.. ఎంత బాబూ.. వెయ్యో, రెండు వేలో యిస్తుంటారు” అంది. దాంతో వెంకటేశం గతుక్కుమని ఓ మూడొందలు తీసి ఆవిడ చేతిలో పెట్టి  ముందుకి కదిలాడు. అయితే వెంకటేశానికి అంతలోనే తర్వాత ఛాలెంజ్‌ ఎదురయి పోయింది. అదీ వార్డ్‌బోయ్‌ రూపంలో. వెంకటేశం చకచకా బయటికి పోబోతుంటే అడ్డంగా నిలబడ్డాడు. కొంచెం కోపంగా చూస్తున్నట్టు అనిపించింది. ‘ఏం.. నా సంగతేం చేశావ్‌’ అన్న భావనేదో ఆ మొహంలో కనిపించింది. దాంతో వెంకటేశం ఓ అయిదొందలు సమర్పించుకుని అక్కడ్నుంచి ముందుకి నడిచాడు. యింతలో ఆఖరి హార్డిల్‌ వచ్చేసింది. ఈసారొచ్చింది నర్సు. కొంచెం దర్పంగానే ”డిశ్చార్జ్‌ అయి వెళ్ళిపోతున్నట్టున్నారు” అంది. యింకేముంది. వెంకటేశానికి  తర్వాతేం చేయాలో అర్థమయిపోయింది. జేబులోంచి ఓ వెయ్యితీసి సమర్పించుకున్నాడు. అప్పటికే బుర్ర వాచిపోయిన వెంకటేశం గేటు దాకా వెళ్ళిపోయాడు. యింతలో గేటు దగ్గరుండే గూర్ఖా గబగబా  పరిగెత్తుకొచ్చి  చేతిలో లగేజీ తీసుకుని పట్టుకెళ్ళి ఆటోలో పెట్టేశాడు. యింకేముంది. వెంకటేశం జేబులోంచి యింకో వందనోటు ఆ గూర్ఖా జేబులోకి మారిపోయింది. మొత్తానికి మామూళ్ళ రూపంలో ఓ 2200 వదిలించుకుని వెంకటేశం హాస్పిటల్‌ నుంచి బయటపడ్డాడు.
అఅఅఅ
వెంకటేశం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అంతా కల..! అయినా ఎందుకయినా మంచిదని లోపలికి తొంగిచూశాడు. లోపల మంచ మయితే ఖాళీగా ఉంది. ‘హమ్మయ్య… గురువుగారు మంచమెక్కలేదన్నమాట’ అనుకున్నాడు. యింకా గురువుగారయితే వాకింగ్‌ నుంచి వచ్చిన జాడలేదు. దాంతో వెంకటేశం మళ్ళీ చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. అందులో యింకో కలొచ్చింది.
అఅఅఅ
గిరీశం ఆరోజే హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. ఆ బిల్లేదో వెంకటేశం వెళ్ళి కట్టేశాడు. మొత్తమది పన్నెండువేలయింది. ఆ మొత్తానికి బిల్లు కూడా  యిచ్చేశారు. యింతలో వెంకటేశం అనుమానంగా ”స్టాఫ్‌కి మామూళ్ళేవయినా యివ్వాలా?” అన్నాడు. దానికి రిసెప్షనిస్ట్‌ ”ఎవరికీ ఏవీ యివ్వక్కర లేదు. ఎవరూ అడగరు కూడా. మీ బిల్లెంతో దానిలో ఓ 20 శాతం యిక్కడే కట్టె య్యండి. అదేదో అందరికీ వెడుతుంది” అన్నాడు. దాంతో వెంకటేశం యిదేదో బావుందనుకుని యిరవై నాలుగొందలు యిచ్చేశాడు. ఆ శాల్తీ ఆ మొత్తం తీసేసుకుని యింకో పుస్తకంలో రాసుకున్నాడు. అక్కడ్నుంచి వెంకటేశం గిరీశాన్ని తీసుకుని చకచకా బయటికి నడిచాడు. దారిలో మామూళ్ళ సైంధవులు ఎవరూ తగలనే లేదు.
అఅఅఅ
ఎవరో తడుతుండేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఈసారి ఎదురుగా గిరీశం..! అప్పుడే వాకింగ్‌ నుంచి వచ్చేసినట్టు న్నాడు. ”ఏవివాయ్‌ వెంకటేశం.. ఏవో కలలు కంటున్నట్టున్నావ్‌” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవును గురూగారూ.. అవేవో హాస్పిటల్‌ కల లొచ్చాయి. మీరు మంచమెక్కుతారని అనుమానంగా ఉంది” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ”ఆ వెధవ జోకులాపి ఆ కలలేంటో చెప్పి చావు” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన రెండు కలలూ చెప్పాడు. అంతా విని గిరీశం ”అయితే ఈసారి నీ కలలో దూరింది. జిఎస్‌టి అన్నమాట. యిప్పుడు నీ కలల అర్థమేంటో చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ”యింతకాలం దేశంలో సవాలక్ష రకాల టేక్స్‌లున్నాయి. సెంట్రల్‌ సేల్స్‌ టాక్సూ, స్టేట్‌ సేల్స్‌ టాక్సూ, వ్యాట్‌ టాక్సూ, యింకో టేక్సూ అని పదహారు రకాలున్నాయి. అయితే యివన్నీ అన్నిచోట్లా ఒకేలా ఉండవు. ఒక్కోచోట ఒక్కోలా ఉంటున్నాయి. ఒక వస్తువు వినియోగదారుడికి చేరాలంటే ఎన్నో టేక్స్‌లు దాటుకుని మరీ రావలసి వస్తోంది. అయితే యిప్పుడు జిఎస్‌టి వలన దేశమంతా ఒకే టేక్స్‌ విధానం వచ్చింది. అయితే యిది మంచిదా కాదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. దీని వలన ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందనే భావమూ ఉంది. వాస్తవంగా ఆలోచిస్తే జిఎస్‌టి అమలులో ఉన్న యితర దేశాలతో పోలిస్తే మన దేశంలో జిఎస్‌టి ఎక్కువే. దీని వలన వివిధ రంగాలపై, సామాన్య ప్రజలపై పన్నుల భారం పెరగొచ్చు. అయితే కొద్ది కాలంలో వివిధ వస్తువుల టేక్స్‌ల శ్లాబులో అవసరమయిన మార్పులు చేయడం జరగ వచ్చు! ఈ జిఎస్‌టి వలన జరిగేది మొత్తం అన్ని రంగాల నుంచీ ఏకీ కృతమై టేక్స్‌ రాబట్టడం. యిక అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. యిలా తాము చెల్లించే టేక్స్‌లన్నీ తిరిగి తమ సంక్షేమానికే ప్రభుత్వం వినియోగిస్తుందనీ, అది వ్యవస్థ బాగుకేననీ..” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

కాషాయ కషాయం

మనస్సాక్షి  – 1044
అక్కడో ముఖ్యమయిన సమావేశం జరుగుతోంది. ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నది కూడా మోడీ, అమిత్‌షాలు. వాళ్ళిద్దరూ కలిసి నిర్వహించే సమా వేశాలు నెలకో నాలుగైదు ఉండనే ఉంటాయి. అయితే యిప్పుడు జరుగుతున్న సమావేశానికో ప్రత్యేకత ఉంది. దేశంలో అన్ని పార్టీల నాయ కులూ అందులో పాల్గొంటున్నారు. అయితే ఎవరి మొహాల్లోనూ భావాలు అంతగా పలకడం లేదు. యిక  సమావేశం మొదలవుతుండగా వామన్రావు వచ్చాడు. వామపక్షానికి చెందిన వామన్రావు ఎప్పుడూ పెద్దగా నవ్విన దాఖలాలుండవు. యిప్పుడూ అంతే. యింతలో మోడీ మాట్లాడడం మొద లెట్టాడు. ”ఈరోజు మీ అందరినీ యిక్కడికి పిలవ డానికో కారణముంది. మీ అందరికీ తెలుసు… ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం పూర్తికా వొచ్చింది. కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. మామూ లుగా అయితే మా కూటమికున్న బలంతో మేము నిలబెట్టే అభ్యర్ధిని గెలిపించేసుకోవచ్చు. ఏ పార్టీ సహాయం అవ సరం లేదు. అయితే రాష్ట్రపతి పదవి అంటే ఎంతో ఉన్నత మయింది. ఆ ఎన్నికేదో ఏకగ్రీవ మయితే బావుంటుంది. అందుకే మీరంతా సహకరిస్తే మేము నిల బెట్టే అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరుగుతుంది. అదే జరిగితే  రేపు రాష్ట్రపతి అయింతర్వాత తనకి మద్దతిచ్చారని మీ అందరి మీదా ఆయనకు మంచి అభిప్రాయం ఉంటుంది” అంటూ వివరించాడు. అయితే తమ కేండిడేట్‌ ఎవరనేది ప్రకటించలేదు. దాంతో అంతా తమలో తాము మాట్లాడు కోవడం మొదలెట్టారు. అయితే తమ అభిప్రాయం ఏదీ చెప్పకుండానే బయటకెళ్ళిపోయారు. బయట ఎదురుచూస్తున్న విలేఖర్ల దగ్గర జరిగిందంతా చెప్పారు. ఎవరో కూడా చెప్పలేదు. మద్దతు ఎలా యిచ్చేస్తామంట? కుదరదు” అని స్టేట్‌మెంట్‌ యిచ్చాడు.
అఅఅఅ
యిది జరిగిన వారం రోజుల తర్వాత దాదాపు యిలాంటి సమావేశమే యింకొకటి జరిగింది. ఈసారి అమిత్‌షా మాట్లాడుతూ ”మేము ఎన్డీయే తరపున రామనాథ్‌ కోవింద్‌ని ఎంపిక చేయడం జరిగింది. ఆయనయితే అన్ని విధాలా ఈ పదవికి అర్హులు. మీ అందరూ సహ కరిస్తే ఏక గ్రీవం సాధ్యమవుతుంది” అన్నాడు. ఈసారి కూడా ఎవరూ మాట్లాడలేదు. ఆ మాట్లాడేదేదో బయట విలేఖర్ల దగ్గర మాట్లా డారు. యిక వామ న్రావయితే పులయి పోయాడు” అదెలా కుదురు తుందంట? కేండిడేట్‌ని సెలక్ట్‌ చేసేశారు. అంటే నిర్ణయం జరిగిపోయి నట్టే. యిక మేము చేసేదేముం దని? అందుకే మేం ఆ కేండి డేట్‌కి సపోర్ట్‌ చేయడం” అన్నాడు ఆవేశంగా. అంతా శ్రద్ధగా రాసుకోసాగారు.
అఅఅఅ
వెంకటేశం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అంతా కల..! చుట్టూ చూస్తే పొగ జాడ.. అదే.. గురువుగారి జాడ లేదు. దాంతో మళ్ళీ యింకోసారి నిద్ర లోకి జారుకున్నాడు. ఈసారి యింకో కలొచ్చింది.
అఅఅఅ
సమావేశం మొదలయింది. సమావేశం దేశంలోని అన్ని పార్టీల అగ్ర నాయ కులతో కళకళలాడిపోతోంది. యింతలో మోడీ ”రామనాథ్‌ కోవింద్‌ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించాలని అనుకుంటున్నాం. పార్టీ లకి అతీ తంగా మీ అందరూ సహకరిస్తే ఏకగ్రీవం సాధ్యమవుతుంది” అన్నాడు. రామనాధ్‌ కోవింద్‌ పేరు చెప్పేక సమావేశంలో చిన్నపాటి కలకలం రేగింది. కొందరయితే ‘ఎవరీ రామనాధ్‌ కోవింద్‌’ అన్న ట్టుగా అడిగేశారు. యింకొందరయితే ‘అవును. ఆయన గవర్నర్‌గా చేస్తున్నారు కదా’ అనుకున్నారు. ఈలోగా యింకొందరు తమ వాళ్ళకి ఫోన్‌ చేసి సదరు కోవింద్‌ గురించి ఎంక్వయిరీ చేయమన్నారు. ఈలోగా స్నాక్స్‌, టీ సర్వ్‌ చేశారు. ఆ తర్వాత మళ్ళీ సమావేశం మొదలయింది. ఈసారి కొంచెం వాడీ వేడిగానే వాగ్వాదాలు జరిగాయి. వామన్రావయితే ఆవేశంగా లేచి ”కేండిడేట్‌ రాంనాధ్‌ కోవిందయితే  మేం సపోర్ట్‌ చేయలేం” అన్నాడు. దానికి అమిత్‌ షా పదునుగా ”ఏం.. ఆయనయితే ఏవయిందీ?” అన్నాడు. దానికి వామన్రావు ”అతని మూలాలు మాకు నచ్చలేదు” అన్నాడు. దాంతో మోదీ ”ఆయన మూలా లకేం? ఆయనకి దళితుడన్న మూలాలున్నాయి. విద్యా ధి కుడనే  మూలాలు న్నాయి. ప్రజా సంక్షేమానికి పాటుపడే మనస్థత్వ మూలాలున్నాయి. యింతకంటే ఏం కావాలి?” అన్నాడు. అప్పుడు వామ న్రావు బాంబు పేల్చాడు. ”అవన్నీ అనవసరం. అత డొచ్చింది ఆరెస్సెస్‌ మూలాల నుంచి. అలాంటి మూలా లున్న వ్యక్తికి మేం సపోర్ట్‌ చేయలేం” అని తేల్చి చెప్పే శాడు. ఈలోగా సమావేశంలో యింకెవరో ”మరలాగ యితే మోడీగారు కూడా ఆరెస్సెస్‌ నుంచి వచ్చిన వారే కదా. ఆయన ప్రధానిగా ఉన్నారు కదా” అన్నారు. దాంతో వామన్రావు యిబ్బందిపడి ”ఆ… అదివేరు.. యిది వేరు” అంటూ మాట దాటించేశాడు.
అఅఅఅ
మొహంమీద పొగ పడుతుండేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎదురుగా గిరీశం. ”ఏవివాయ్‌ వెంకటేశం.. కలలు కనడంలో బాగా బిజీగా ఉన్నట్టున్నావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలలన్నీ చెప్పాడు. అంతా విన్న గిరీశం నవ్వేసి ”అధికారపక్షం ఏవన్నా ‘నో’ అనాల్సిందే అనే ప్రతిపక్షాల తీరు నీ కలలో వచ్చేసిందోయ్‌.. ఒకవేళ మోడీగారు సంచలనాత్మక రీతిలో ఏ ప్రతిపక్ష కేండిడేట్‌నో రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేశారనుకుందాం. అప్పుడు కూడా ప్రతిపక్షాలు తమ స్వభావ సిద్ధంగా ఆ కేండిడేట్‌కి కూడా వంకలు పెట్టి, ఈకలు పీకడం ఖాయం. అయినా విపక్ష నాయకులు మాట్లాడేది ఎలా ఉందో చూశావా… ఒక దళితుడినీ, విద్యా ధికుడినీ, మేధావినీ, నిష్కళంకుడినీ రాష్ట్రపతి అభ్యర్ధి కింద ఎంపిక చేశారన్న విలువ కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనకి ఆరెస్సెస్‌ మూలాలుండడమే పెద్ద సమస్య అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం… ఆరెస్సెస్‌ అనేది ఏమయినా నిషేధిత సంస్థా? కాదే. అదే నిజమయితే ఆ సంస్థని ఎప్పుడో నిషేధించి పారే యాలి కదా. ఆరెస్సెస్‌ని అదేదో ఐసిస్‌ సంస్థలా చూడడం ఎంత వరకు సమంజసం? వాస్తవంగా చెప్పాలంటే  తమ పార్టీకున్న ఓట్ల శాతాన్ని బట్టి అధికార పార్టీ కోరుకునే వ్యక్తికే  రాష్ట్రపతి పదవి దక్కు తుంది. అటువంటప్పుడు సంఘ పరివారంలో భాగమయిన బీజేపీకి సంబంధించిన వ్యక్తి రాష్ట్రపతి కావడం సాధారణ విషయమే. అయితే ఓ రకంగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఆరెస్సెస్‌ మూలాలుం టాయి. అంటే వాళ్ళెవరూ రాష్ట్రపతి పదవికి అర్హులు కాదన్నమాట” అన్నాడు. వెంకటేశం అవునన్నట్టుగా తలూపాడు. అంతలోనే వెంకటేశం ఏదో తట్టినట్టు ”గురూగారూ… మిగతావాళ్ళ మాటెలా ఉన్నా మన ఆంధ్రా వాళ్ళకి మాత్రం  ఆ ప్రతిపక్షాల అభ్యర్ధి మీరాకుమార్‌ మా గొప్ప సాయం చేసింది కదా. అప్పట్లో  పార్లమెంటులో స్పీకర్‌గా ఉన్నప్పుడు తలుపులు మూయించేసి చీకట్లో విభజన బిల్లు పాస్‌ చేయించిన చరిత్ర ఆవిడదే కదా” అన్నాడు. గిరీశం తలూపి యింకో చుట్టంటించుకున్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

మా చెడ్డ మంచోళ్ళు

మనస్సాక్షి  – 1043
”నాతో మాట్లాడ్డవే ఓ ఎడ్యుకేషననుకో” అన్నాడు గిరీశం నడుస్తూనే. దాంతో కొంచెం వెనగ్గా నడుస్తున్న  వెంకటేశం ”ఆ.. అదెక్కువయిపోయే మా జీవితాలు యిలా ఉన్నాయి. అయినా గురూ గారూ… మీకు బోల్డన్ని రాజకీయ పరిచయాలు న్నాయి కదా. వాళ్ళలో ఎవరినో ఎడ్యుకేట్‌ చేసేసి నాకో సీటిప్పించరాదూ..” అన్నాడు. ఏవనుకున్నాడో గిరీశం చటుక్కున జేబులోంచి ఫోన్‌ చేసి ఎవరికో ఫోన్‌ చేసి మాట్లాడేశాడు. వెంకటేశం అలా నోరెళ్ళబెట్టి చూస్తుండగానే గిరీశం ”అధికార పార్టీ జిల్లా యిన్‌ఛార్జ్‌ వీర్రాజుతో మాట్లాడేశా. రేపే వెళ్ళి కలు” అన్నాడు. వెంకటేశం హుషారుగా తలూపాడు.
——-
మర్నాడు పొద్దున్నే వెంకటేశం వీర్రాజు దగ్గర వాలిపోయాడు. వీర్రాజు కూడా యింతకు ముందే వెంకటేశం గురించి విని ఉన్నాడు. దాంతో అప్పటికప్పుడే హైకమాండ్‌కి ఫోన్‌ చేసి చెప్పేసి, ఆరోజే జిల్లాకి చెందిన ఓ మంత్రిగారి చేతులమీదుగా వెంకటేశానికి పార్టీ తీర్థం యిప్పించేశాడు. అందుకు తగ్గట్టే వెంకటేశం కూడా చాలా తొందరగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలెట్టాడు. తనుండే అంబాజీపేట నియోజకవర్గంలో ఎడాపెడా తిరుగుతూ సమస్యలు పరిష్కరించేస్తు న్నాడు. దాంతో వెంకటేశం పేరు అందరి నోళ్ళలోనూ నానుతోంది. పదవేమీ లేకపోయినా యింత చేస్తున్నాడంటే  అసలా పదవే ఉంటే యింకా బ్రహ్మాండంగా చేస్తాడన్న  భావం అందరిలో వచ్చింది. వచ్చే ఎలక్షన్స్‌లో వెంకటేశానికి సీటు గ్యారంటీ అన్న టాక్‌ కూడా బయట కొచ్చింది. యింతలో  ఓ విశేషం జరిగింది. పార్టీలన్నీ స్ట్రేటజీ మార్చే శాయి. యింతకు  ముందయితే అన్ని సీట్లకో అభ్యర్ధుల్ని ఎలక్షన్‌కి కేవలం నెలముందే ఎనౌన్స్‌ చేసేవి. అయితే యిందులో సమస్య లొస్తున్నాయి. సీటురాని అసంతృప్తులంతా అలిగేసి పార్టీని దెబ్బ తీస్తున్నారు.  అందుకే ఈసారి ఎలక్షన్‌కి దాదాపు రెండేళ్ళ ముందరే అభ్యర్ధుల్ని ఎనౌన్స్‌ చేశాయి. దీని వలన ఆ అసంతృప్తుల్ని బుజ్జ గించడానికో, యింకో దారిలో బుట్టలో వేయడానికో బోల్డంత టైముంటుంది. మొత్తానికి 2019 ఎలక్షన్స్‌కి 2017లోనే అభ్యర్ధుల ఎంపిక జరిగిపోతోంది. దాంతో అంతా అసక్తిగా ఎవరికి సీటు వస్తుందా అని చూస్తున్నారు. వెంకటేశం అయితే అంబాజీపేట  సీటు తనకి గ్యారంటీ అన్న ఆలోచనలో ఉన్నాడు. ఈలోగా ప్రాంతాల వారీగా అభ్యర్ధుల జాబితాలు బయటకొచ్చేశాయి. అయితే అంబాజీ పేట సీటు మాత్రం ఎవరికిచ్చిందీ పార్టీ ప్రకటించనే లేదు.  దాంతో వెంకటేశంలో టెన్షన్‌ మొదలయింది. యింకో వారమయినా అదే పరిస్థితి. దాంతో అప్పుడెళ్ళి వీర్రాజుని కలిశాడు” యింకా అంబాజీపేట అభ్యర్ధిని ప్రకటించలేదు. అది నాకే కదా..” అన్నాడు. అయితే వీర్రాజు వెంటనే అవుననలేదు. ”లేదు వెంకటేశం… మామూలుగా అయితే ఆ సీటు నీదే. అయితే మధ్యలో కొన్ని సమస్యలొచ్చాయి. ఆ విసనకర్ర పార్టీ  రాందాసు మన పార్టీలోకి వస్తాడంటున్నారు. సీటిస్తేనే వస్తానంటున్నాడని తెలిసింది. అదే జరిగితే అతనికే ఆ సీటివ్వాలి. యింకా నారాయణస్వామి తెలుసు కదా. ఏ పార్టీలో లేకుండానే ప్రజాసేవ చేస్తుంటాడు. పబ్లిక్‌లో మంచి పేరుంది. అతడూ రావొచ్చని తెలుస్తుంది. అతడేగానీ ఎలక్షన్‌లో పోటీ చేస్తే యింకెవరూ పోటీ చేయక్కరలేదు. మొత్తం ఓట్లన్నీ పట్టుకుపోతాడు. ఆ నారాయణస్వామీ రావొచ్చనే టాక్‌ ఉంది. అదే జరిగితే అతనికే సీటివ్వాల్సిందే” అన్నాడు. దాంతో వెంకటేశానికి నీరసం ముంచుకొచ్చేసింది. ఈ లెక్కన సీటు రావడం ఏమాత్రం గ్యారంటీ లేదని బాగా అర్థమయిపోయింది. నిరాశగానే వెనుదిరిగాడు. అక్క డ్నుంచి వెళ్ళి తన బాధంతా గిరీశంతో చెప్పుకున్నాడు కూడా. గిరీశం కూడా చేసేదేంలేక బాధపడ్డాడు. యింకో రెండ్రోజులు గడిచి పోయాయి. వెంకటేశం తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాడు. పబ్లిక్‌లోనయితే  యిప్పటికే తనకి మంచి పేరొచ్చేసింది. పార్టీకి కూడా సంబంధం లేకుండా కొంత మేర తనకి ఓట్లు పడడం ఖాయం. అలాంటప్పుడు సీటు రాని ఈ అధికార పార్టీని అంటిపెట్టుకుని ఉండే బదులు సీటిచ్చే పార్టీలోకిపోతే ఎలా ఉంటుందా అని ఆలోచించడం మొదలెట్టాడు. దాంతో తను విసనకర్ర పార్టీలో చేరదామని అనుకుంటు న్నట్టుగా చిన్న పీలరొకటి వదిలాడు. అదేదో విసన కర్ర పార్టీలో పెద్ద కలకలమే సృష్టించింది. ఆగ మేఘాలమీది ఆ పార్టీ జిల్లా యిన్‌ఛార్జి పరిగెత్తు కొచ్చేశాడు. ”యిదిగో వెంకటేశం… నువ్వు మా పార్టీలో చేరతానంటే మాకు అంతకంటే ఏం కావాలి? సీటు కూడా నీకే” అన్నాడు. మొత్తానికి మర్నాడు జరగబోయే పార్టీ బహిరంగ సభలో ఈ విషయం ప్రకటించడానికీ, జిల్లాస్థాయి నాయకుల చేతులమీదుగా కండువా కప్పించుకోవడానికీ  నిర్ణయం జరిగిపోయింది.
——
మర్నాడు సాయంత్రం అయిదు గంటలు… అప్పటికే ఊళ్ళో విసనకర్ర పార్టీ వాళ్ళ సభ మొదలయింది. రకరకాల అంశాల మీద జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు. యింతలో వెంకటేశాన్ని స్టేజ్‌ మీదకి రావలసిందిగా ప్రకటనొకటి వినపడింది. దాంతో వెంకటేశం పైకి లేచి స్టేజ్‌ వైపు నడిచాడు. స్టేజ్‌ కున్న మెట్లెక్కుతుండగా అప్పుడు జరిగిందది. ఎక్కడో దూరాన్నుంచి గిరీశం పరిగెత్తుకొస్తున్నాడు. అలా పరిగెత్తుకొస్తూనే స్టేజ్‌ ఎక్కొద్దని సైగలు చేస్తున్నాడు. ఏం జరిగిందో వెంకటేశానికి అర్థం కాలేదు. దాంతో అలా మెట్లమీదే ఆగాడు. యింకో అర నిమిషంలో వగర్చుకుంటూ గిరీశం వచ్చేశాడు. వస్తూనే ”నీకు వాళ్ళు సీటిచ్చేసేరంట. నీ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుందని వీర్రాజు నాకు ఫోన్‌ చేసి చెప్పాడు. అసలు ఈ సీటు నీకే యిమ్మని నువ్వు పార్టీలో చేరినప్పుడే సీఎంగారు చెప్పారంట. ఈ వీర్రాజు ఏమర్చి నట్టున్నాడు. యిందాక మళ్ళీ హైకమాండ్‌ నుంచి ఈ సీటు నీకే యిమ్మని ప్రత్యేకంగా ఫోనొచ్చిందంట” అన్నాడు. దాంతో ఒక్క క్షణం వెంకటేశానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలోనే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా గబగబా కిందకి దిగేశాడు. ఈలోగా ఏవయిందా అని విలేఖర్లు మూగారు. దాంతో వెంకటేశం అక్కడేం మాట్లాడకుండా గబగబా ఆ మీటింగ్‌లోంచి బయటికొచ్చేశాడు. అక్కడ నోరిప్పి ”మరేంలేదు. అధికార పార్టీ అంబాజీపేట సీటు నాకిచ్చారు” అని చెప్పేసి చక్కాపోయాడు. అయితే అసలయిన గమ్మత్తు అక్కడే జరి గింది. వెంకటేశం యిలా ఉన్నట్టుండి వెనుదిరగడంతో స్టేజ్‌ మీదున్న విసనకర్ర నాయకులకి జరిగింది అర్థమయిపోయింది. దాంతో వాళ్ళు కూడా వెంకటేశం విషయం ఎత్తకుండానే తమ కార్యక్రమం లాగిం చేశారు. యింతలో ఆ వచ్చిన విలేఖర్లలో ఒకరికి స్టేజెక్కే మెట్ల దగ్గర ఓ పేపరు దొరికింది. అది వెంకటేశం స్టేజ్‌ మీద చదవడానికి తెచ్చుకున్న స్పీచ్‌… జేబులోంచి జారిపోయినట్టుంది. అందులో ‘నేనింతకాలం ఉన్న పార్టీలో నాకు సరయిన గుర్తింపు లేదు. అసల యితే ఆ పార్టీకి సరయిన విధానాలూ, సిద్ధాంతాలూ లేవు. ఆ పార్టీకి సరయిన భవిష్యత్తు కూడా లేదు. అలాంటి పార్టీలో ఉండకూడదనే ఈరోజు విసనకర్ర పార్టీలోకి మారిపోతున్నాను. నా ఉద్దేశ్యంలో ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ విసనకర్ర పార్టీ ఒక్కటే… యిలా సాగిందది. దాంతో అసలే హుషారుగా ఉండే ఆ విలేఖరి దానిని కాస్తా మైకులో చదివి వినిపించేశాడు. దాంతో అంతా నోరెళ్ళబెట్టారు.
——–
”అది గురూగారూ…నాకొచ్చిన కల. అంతా బాగానే ఉంది గానీ చివర్లో ఆ ట్విస్టేంటంట?” అన్నాడు వెంకటేశం బాధపడిపోతూ. దాంతో గిరీశం ”మరి యిప్పుడు వ్యవస్థంతా యిలాగే ఉంది కదా? ఏం… ఈ సీటురాని వాళ్ళంతా యిలాగే తయారవడం లేదూ… తమకి సీటిచ్చేస్తే ఆహా… ఓహో.. అంటారు. పార్టీ సిద్ధాంతాలు అంత గొప్పవీ, యింత గొప్పవీ అంటారు. అదే సీటివ్వలేదో క్షణంలో ఆ పార్టీ సిద్ధాంతాలు బొత్తిగా నేలబారువి అయిపోతాయి. ఆ పార్టీ ఎందుకూ పనికిరానిదయిపోతుంది. యిదేం పద్ధతని…? సీటిచ్చినా, యివ్వక పోయినా పార్టీ స్థాయేం మారిపోదు కదా. అయినా సీటు కోసం యిలా వెంపర్లాడే బదులు ఆ ఊబలాటమేదో ప్రజా సంక్షేమం కోసం వెచ్చిస్తే పార్టీలు వెతుక్కుంటూ వచ్చి సీటిస్తాయి” అన్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

డిపార్ట్‌మెంటల్‌ హోమ్‌ 

మనస్సాక్షి
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నది కొంచెం పాత కాలం నాటి మాట. అయితే యిప్పుడు దాన్ని తిరగరాసే పనిలో పడ్డాడు వెంకటేశం. వెంకీ పెళ్ళి ఆ వెంకీ చావుకే వచ్చి పడ్డట్టయింది. అదే… మన వెంకటేశం తన పెళ్ళితో తనే యిబ్బందుల్లో పడిపోయాడు. ‘అదేంటీ… పెళ్ళి కోసం వెంకటేశం తెగ ఉబలాటపడిపోయేవాడు కదా… మరి దేంటీ’  అంటే  ‘ ఆ పెళ్ళి… చేసుకోవడం అంటే  చావు కొని తెచ్చుకోవడం లాంటిదే లెద్దూ… అని ఒకళ్ళిద్దరు అనుభవజ్ఞులు తల నిమురుకుంటూ చెపుతుండొచ్చు గాక. అయితే వెంకటేశం విషయం వేరు. వెంకటేశానికి గ్రూప్‌ 1 లో ప్రయత్నాల తర్వాత సబ్‌ రిజిష్ట్రార్‌గా సలక్షణమయిన ఉద్యోగం రావడం జరిగింది. యింకేముంది ఝామ్మని మంగతాయారుతో పెళ్ళి కూడా అయిపోయింది. మంగతాయారు కూడా బాగా చదువుకున్నదే. పైగా వెంకటేశం ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉంటుంది. అయితే యింటర్నెట్‌లో ఎక్కువగా దూరడం అలవాటు. అదే వెంకటేశం కొంపముంచింది. నెట్‌లో తను చూసిన విషయాల గురించి మంగతాయారు బోల్డంత ఉబలాటంగా చెప్పేది. వెంకటేశం అవన్నీ వినేసి ఊరుకునేవాడు. అయితే ఆ రోజు చెప్పిన విషయం మాత్రం అలా ఊరుకునేలా లేదు. ” ఏవండీ…జయలలితని చూడండి నూట యాభై చెప్పుల జతలు, వందల కొద్ది నెకె ్లస్‌లు, యింకా వేల కొద్దీ చీరలు ఉన్నాయట” అంది కళ్ళింత చేసుకుని. అది విని వెంకటేశం కొంచెం అసహనంగా చూశాడు. ” ఆ…ఈవిడదేవుందిలే…వేరే దేశంలోనూ యిలాంటి సరదాలు ఉన్నోళ్ళు యింకా ఉన్నట్టున్నారు” అన్నాడు. మంగతాయారు వెంటనే  ” అవునండీ…ఫిలిప్ఫీన్స్‌ని ఒకప్పుడు పాలించిన ఇమెల్డా కయితే  యివన్నీ యింకో నాలుగింతలు ఎక్కువే ఉన్నాయి” అంది.  వెంకటేశం ఓహో అనేసి పైకి లేవబోయాడు. అప్పుడు మంగతాయారు అసలు విషయంలోకి వచ్చింది. ” ఏవండీ.. మనం కూడా అలాగే అన్నేసి కొనుక్కుందామా?” అంది. దాంతో వెంకటేశం అయితే  మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టుగా అదిరిపోయాడు. ” అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్ధమవుతుందా? అన్నాడు. అయినా అవన్నీ కొనే స్తోమత మనకెక్కడిది?” అన్నాడు. దాంతో మంగతాయారు ఆ మాత్రం తెలీదా అన్నట్టుగా చూసి ” అదేంటండీ… మీరు బ్రహ్మండమైన ఉద్యోగంలో ఉన్నారు కదా.  ఎంత దున్నేయెచ్చని”…అంది. దాంతో వెంకటేశం ‘ఖచ్చితం’గా అస్సలు కుదరదు…అలా అడ్డదారిలో సంపాదించడం నా కిష్టం లేదు” అని తేల్చి చెప్పేశాడు. దాంతో మంగతాయారు మొహం మాడ్చుకుని అక్కడ్నుంచి లోపల కెళ్ళిపోయింది. యిక ఆ రోజు నుంచి వెంకటేశం యింట్లో నరకం మొదలయింది. అలాగని మంగతాయారేవీ ఆనాటి సూరేకాంతంలా పూటపూటకీ గొడవలు చేయడం లేదు. మౌనంగానే ఉండి మొహంలో భావాలతో  చంపేస్తోందంతే. వెంకటేశానికయితే అసలు పెళ్ళెందుకు చేసుకున్నానురా బాబూ’ అన్న పరిస్ధితి వచ్చేసింది. యిలాంటి పరిస్థితి కొన్నేళ్ళు నడిచింది. పోనీ మంగతాయారు ముచ్చటేదో తీర్చేద్దామంటే తను నీతి నియమాలకి తిలోదకాలు యిచ్చెయ్యాలాయె. సరిగ్గా అలాంటి పరిస్థితిల్లో జరిగిందది.
———–
ఆరోజు వెంకటేశం భోజనం చేస్తున్నప్పుడు ” మనం యిల్లు మారబోతున్నాం. ఆలా పెద్ద యింట్లోకి వెడుతున్నాం” అన్నాడు. దాంతో మంగతాయారు ఆ .. ఈ బోడి  సామాన్లకి అంత అవసరమా?’ అన్న ఎక్స్‌ప్రెషనొకటిచ్చింది. యింతలో వెంకటేశం మళ్ళీ ” మరి వందలకొద్దీ చెప్పుల జతలూ, బట్టలూ, వాచీలు లాంటివి పెట్టుకోవడానికి ఈ ఇల్లు సరిపోదుగా” అన్నాడు. దాంతో మంగతాయారు మొహంలో వెలుగొచ్చేసింది. కూరలవీ కొసరి కొసరి మరీ వడ్డించేసింది.
————
వారం తిరక్కుండానే  వెంకటేశం వాళ్ళు కొత్తింటికి మారిపోయారు. యిల్లయితే బ్రహ్మండంగా ఉంది. అయితే  యింకా ఆ వందలకొద్ది వస్తువులే లేవు. యింట్లోకి దిగిం తర్వాత వెంకటేశం” యిదే కాదు. ఈ పక్కిల్లు కూడా మనం తీసుకోబోతున్నాం” అన్నాడు. దాంతో మంగతాయారు అదిరిపడి అదెందుకండీ…” అంది దాంతో వెంకటేశం ‘అదెందుకన్నది తర్వాత నీకే అర్ధమవుతుంది” అన్నాడు. రెండ్రోజుల తర్వాత ఆ పక్కిల్లు కూడా తీసుకున్నట్లుగా  చెప్పాడు. అంతే కాదు… ఆ రోజు అర్ధరాత్రి  వెంకటేశం తన యింటికీ, ఆ పక్కన తీసుకున్న యింటికి మధ్య నున్న తలుపులు తెరిచాడు. మంగతాయారుని ఆ గుమ్మంలోంచి పక్కింట్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ కనిపించింది చూసి మంగతాయారు కళ్ళు చెదిరిపోయాయి. దానిక్కారణం ఆ యింటినిండా ఎటు చూసినా చెప్పుల జతలు, వాచీలు, బట్టలు లాంటివి వందల్లో, వేలల్లో కనిపిస్తున్నాయి. అసలు అవన్నీ చూస్తుంటేనే మతిపోతోంది. ‘ నీతి కబుర్లు చెప్పే తన పతిదేవుడు యిలా ఎలా మారిపోయాడన్నదే బొత్తిగా అర్ధం కావడం లేదు. యింతలో వెంకటేశం ” నీకు తెలుసు కదా యిదంతా అక్రమంగా సంపాదించిన దాంతో  కొన్నది. బయటకు యివేమీ తేవడానికి కుదరదు. అందుకే నువ్వుయితే బయటకు వేసుకు వెళ్ళడానికి లేదు. కావాలంటే బాగా పొద్దు పోయాక అంటే అర్ధరాత్రి పూట యిక్కడకొచ్చి చూసుకుని ఆనందిస్తుండు. సరేనా…” అన్నాడు. దానికి మంగతాయారు ” ఆ…అలాగేనండీ” అంది హుషారుగా.
 ———
మర్నాడు వెంకటేశం తారాచంద్‌కి ఫోన్‌ చేశాడు. ” చాలా థేంక్స్‌ రా…”’ అన్నాడు. అవతల్నుంచి తారాచంద్‌ కూడా… ” మరేం ఫర్వాలేదురా. అయినా నీ గురించి నీకు తెలీదా…. మీ ఆవిడ వాటిని చూసి  ఆనందించుకుంటుంటే నాకు పోయేదేవీ ఉండదు కదా” అన్నాడు. అలా అనేసి ఫోన్‌ పెట్టేశాడు. యింతకీ వెంకటేశం మాట్లాడింది ‘ తారా డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌”  యజమాని అయిన తారాచంద్‌తో. యింతకీ ఆ షాపునకు గాంధీనగర్‌లో  ఫోర్త్‌  క్రాస్‌ లేన్‌లో ఎంట్రన్సూ, ఫిఫ్త్‌ క్రాస్‌ లేన్‌లో వెనుక భాగం ఉన్నాయి. అంటే మొత్తానికి ఆ షాపేదో రెండు వీధుల్లోకి ఉంది. అయితే షాపు వెనుక వైపున్న భాగం వెంకటేశం ఉంటున్న  యింటికి ఆనుకుని ఉంది. యింతకీ వెంకటేశం అర్ధరాత్రి తలుపులు తీసుకుని వెళ్ళి మంగతాయారుకి చూపించింది ఆ షాపులోకి వస్తువులే….!
———
” గురూ గారూ… నా కలాంటి కలొచ్చింది. ఈ లెక్కన పెళ్ళి చేసుకోవాలంటే యిన్ని వంకర తెలివితేటలూ,మేనేజ్‌మెంటూ అవసరమంటారా? అన్నాడు” వెంకటేశం దిగాలుగా. గిరీశం నవ్వేసి ” యిప్పడు నీకు సంబంధాలేవీ రావడం లేదు కదా. యింకా గొడవ వదిలేసి అసలు నీకి కలెందుకు వచ్చిందో  అదాలోచించు” అన్నాడు.  దాంతో వెంకటేశం కొద్దిగా ఆలోచించి ఈ మధ్య ఓ పెద్ద ఆఫీసరు గారి మీద ఏసీబి వాళ్ళు రెయిడ్‌ చేసినపుడు యిలాగే వందలకొద్దీ చెప్పులూ, వాచీలు , నెక్లెస్‌లు దొరికాయి కదా. అదే నా కలలో దూరినట్టుంది. అతగాడే కాదు. యిలా అడ్డదారిలో సంపాదించే వాళ్ళలో చాలా మంది విషయంలో యిలాంటి విన్యాసాలు చూడొచ్చు. అయినా బడాయి కాకపోతే ఎవరికయినా పదో, పదిహేనో జతల బట్టలు ఉండొచ్చు. అంతేగానీ వందలకొద్దీ జతలు ఎందుకంట? అలాగే  మనం ఒక్క  వాచీనే అయిదూ, పదేళ్ళూ వాడతామే. మరి వందలకొద్ది ఎందుకంట…అలాగే చెప్పులు కూడా! చరిత్రని పరిశీలించినప్పుడు నిజాయితీగా సంపాదించిన వాళ్ళెవరయినా యిలా వందలకొద్దిగా కొన్నట్టు దాఖలాలు లేవు. అడ్డదారుల్లో వచ్చి పడిపోయే ఈజీమనీతోనే యిలాంటి పైత్యం పనులు చేసేది…ఇమెల్డా, జయమ్మ పోయినప్పుడేమీ పట్టుకెళ్ళలేదు అంటూ తేల్చాడు. ఆ… బాగా చెప్పావోయ్‌ అన్నట్టుగా  చూసి గిరీశం యింకో చుట్ట అంటించుకున్నాడు.
డా. కర్రి రామారెడ్డి
మనస్సాక్షి  – 1041
గిరీశం అప్పుడే దిగాడు. అయితే ఆపాటికి వెంకటేశం యింట్లోంచి జోరుగా పొగలొస్తు న్నాయి. దాంతో గిరీశం నోట్లో కాలుతున్న చుట్టని కిందపడేసి లోపలికి పరిగెత్తాడు. అయితే లోపల అంత కొంపలంటుకుపోయే దారుణాలేవీ జరగడం లేదు. హాల్లో వెంకటేశం మాత్రం కూర్చుని ఉన్నాడు. ఆ పొగలేవో వెంక టేశం బుర్రలోంచే వస్తున్నాయి…! దాంతో గిరీశం కంగారుపడి ”ఏవివాయ్‌ వెంకటేశం… యిప్పుడేం కొంపలంటుకుపోయాయని ఆ ఆలోచన లంట?” అన్నాడు. దాంతో వెంకటేశం తల తప్పి చూశాడు. మనిషి వాలకం అదీ బొత్తిగా తేడాగా ఉంది. ఏదో బాధతోనూ, ఉక్రోషంతోనూ రగిలి పోతున్నట్టున్నాడు. దాంతో గిరీశం ”అసలింతకీ ఏవం దోయ్‌?” అన్నాడు. ఆపాటికి కొంచెం సర్ధుకున్న వెంక టేశం ”యింకేం కావాలంట… అవతల ఎంత న్యాయం జరిగి పోయిందని.. అసలు న్యాయం, ధర్మం అనేవి ఉన్నాయా అని” అన్నాడు. దాంతో గిరీశం గట్టిగా విసుక్కుని ”అవన్నీ ఎలాగా ఉన్నాయి గానీ ముందసలు నీకు జరిగిన దిక్కుమాలిన అన్యాయ మేంటో చెప్పి చావు” అన్నాడు. దాంతో గాద్గదికమయిన గొంతుతో వెంకటేశం ”ఆ అన్యాయం జరిగింది సివిల్స్‌లో రేంకు గురించి లెండి” అన్నాడు. గిరీశం అర్థం కానట్టు ”అయినా దీనికీ నీకూ సంబంధం ఏంటంట?” అన్నాడు. దాంతో వెంకటేశం తెగ బాధపడి పోతూ ”అసలు నేను ట్రై చేస్తోంది సివిల్స్‌ కోసమే కదా. యిప్పు డందులోనే అన్యాయం జరిగిపోయింది” అన్నాడు. గిరీశం తలూపి ”యింతకీ అందులో నీకే రకంగా అన్యాయం జరిగిందో కొంచెం చెప్పవోయ్‌… నీకిప్పుడేం రేంక్‌ ఏవీ మిస్సయిపోలేదు కదా” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఆ… అన్యాయం అంటే నాకొక్కడికే అని కాదు. నాలాంటి సివిల్స్‌ రాసిన ఎందరో మేధావులకి. చూడండి. యింగ్లీషు మాట్లాడ్డం సరిగ్గా రాదు. పరీక్షంతా తెలుగు మీడియంలో రాశాడు. యింకా యింటర్వ్యూ కూడా  ఎవరో ట్రాన్స్‌ లేటర్‌ని పెట్టుకుని కానిచ్చాడు. అలాంటి వాడికి సివిల్స్‌లో ఏకంగా మూడో రేంకిచ్చారు. ఏం…మాకేం తక్కువని… తెలివి తేటలు లేవా… సబ్జెక్టులేదా.. లేకపోతే యింటర్వ్యూలో అతగాడు పాడినట్టుగా దేశభక్తి పాట పాడటం రాదా..” అన్నాడు ఉక్రోషంగా. దాంతో గిరీశం ”మీ తాత వెంకటేశంలాగే నీకీ ఉడుకుమోతుతనం ఎక్కువేనోయ్‌… లేకపోతే ఎక్కడో అంతగా సౌకర్యాలు లేని మారుమూల పల్లెటూర్లో పుట్టి డిగ్రీదాకా  తెలుగు మీడియంలో… అదీ ‘డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో చదువుకున్న కుర్రాడు అలా సివిల్స్‌లో సెలక్టవడం అంటే అంతా దానికి అభినందించాలి. ఓ రకంగా యిలా జరగడం ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కూడా” అన్నాడు. దాంతో వెంకటేశం అయిష్టంగానే తలాడిం చాడు. యింతలో గిరీశం ”యింకా ఏడుపాపి అసలిందులో మనకి పనికొచ్చే పొలిటికల్‌ వ్యవహారం ఏవయినా ఉందేమో చూడ వోయ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం ఆ కోణంలో ఆలో చించడం మొదలెట్టాడు. హఠాత్తుగా ఏదో తట్టినట్టు ”ఆ..ఈ ఏడుపుగొట్టు వ్యవహారమేదో అక్కడ ఆప్‌ వ్యవహారంలో జరుగుతున్న ట్టుంది” అన్నాడు. గిరీశం తలూపి ”ఊ.. లైన్లో కొచ్చేశావు. కానిచ్చెయ్‌” అన్నాడు. దాంతో వెంక టేశం కొనసాగించాడు. ”యిటీవల ఎన్నికల్లో ఆప్‌ చావుదెబ్బ తినేసింది. మూడేళ్ళ కిందట ఎంత సంచలనస్థాయిలో ఉవ్వెత్తున ఎగసిందో యిప్పుడు అంతే వేగంగా పతనం దిశలోకి పడి పోతోంది. రాజకీయాల్లో గెలుపోట ములు అయితే సర్వసాధారణం. అయితే ఓటమి పాలయి నప్పుడు అంత హుందాగానూ దానికి , ఓటమికి కారణాలు విశ్లేషించి నష్ట నివారణ చర్యలు చేపట్టడంలోనే అసలయిన రాజనీతిజ్ఞత ఉంటుంది. అలా చేస్తే అదేదో వాళ్ళ భవిష్యత్తుకి ఉప యోగపడుతోంది కూడా. అయితే కేజ్రీవాల్‌ తీరయితే అలా లేదు. ‘అబ్బే.. మేమ సలు ఓడిపోవలసింది కాదు. అసలు బీజేపీ యిలా గెలిచిందంటే కారణం అదంతా ఈవీయంల పుణ్యమే. వాటిని ట్యాంపరింగ్‌ చేసి బీజేపీకి ఓట్లన్నీ పడేలా చేయడం జరిగింది’ అంటూ ఓ సంచలనాత్మక ప్రకటన చేశాడు. కేజ్రీవాల్‌ అలా చేసిన ఆరోప ణలు బీజేపీ మీద కాకుండా ఎలక్షన్‌ కమీషన్‌ మీదే చేసినట్ట య్యింది. అయితే యిక్కడ కేజ్రీవాల్‌ మర్చిపోయింది ఒకటుంది. మూడేళ్ళనాడు తమ పార్టీ సంచలనాత్మక రీతిలో ఓట్లు సాధించి గెలిచింది ఈ ఈవీఎంల ద్వారానే అని..! అంటే తానెక్కిన కొమ్మని తానే నరుక్కునేలాంటి అర్థమిచ్చే స్టేట్‌మెంట్‌ యిచ్చినట్టయింది. యింతకీ  సదరు కేజ్రీవాల్‌గారు అందరూ చాలా నమ్మకం పెట్టుకుని అందలం ఎక్కించినట్టుగా అద్భు తాలేం చేయనేలేదు. సగటు రాజకీయ నాయకుడిలాగే అవి నీతిలో కూరుకుపోవడం జరిగింది. ఒకప్పటి అతని సహచరుడే ఆ స్కాములవీ బయటపెట్టడం కొస మెరుపు. ఆ ఆరోపణలకి కేజ్రీవాల్‌ మళ్ళీ నోరెత్తితే ఒట్టు, అనుచరులను పురిగొల్పి భౌతిక దాడులు చెయ్యడం తప్ప ! అలాంటి కేజ్రీవాల్‌ యిప్పుడు ఈవీఎంలని ట్యాంపరింగ్‌ చేయొచ్చని ఇసి మీద విమర్శలు చేశాడు. దాంతో ఇ.సి. అధికారులు తమ పర్యవేక్షణలో  పనిచేసే ఆ ఈవీయంలలో అలాంటి అవకాశం లేదని తేల్చి చెప్పారు. అది నిజం కూడా. అందుకే యిప్పుడు ఇ.సి. కూడా ఆ విమర్శని తిప్పికొట్టడానికి ‘ఎవరయినా వచ్చి ఈవీఎంల పనితీరుని పరీ క్షించు కోవచ్చు’ అని ప్రకటించింది. అయితే యిక్కడే కధ అడ్డం తిరిగింది. అందాకా రెచ్చిపోయిన ఆప్‌ కాస్తా యిప్పుడు ఇ.సి. ప్రకట నకి ప్రతిస్పందించకుండా టెస్టింగు పబ్లిక్‌లో పెట్టాలి. భవంతుల్లో  కాదు అని తోక ముడిచింది. ఏతావాతా తేలేదేం టంటే… యిప్పటికయినా కేజ్రీవాల్‌లాంటివాళ్ళు యిలాంటి ఏడుపుగొట్టు ఆలోచనలు మాని అవినీతిరహితంగా ప్రజలకి ఏదో చేస్తే భవిష్యత్తు మిగులుతుంది”అంటూ వివరించాడు. ఆ…బాగా చెప్పావోయ్‌ అన్నట్టుగా గిరీశం వెంకటేశం భుజంమీద తట్టి, యింకో చుట్ట అంటించుకునే పనిలో పడ్డాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

పువ్వులు – రాళ్ళు

మనస్సాక్షి  – 1040
 
వెంకటేశానికి పెళ్ళి కుదిరింది..! యిదేదో వెంక టేశానికంటే పెళ్ళి కుదరకపోతే కాళ్ళిరగ్గొడతా నని వెంకటేశం తండ్రి తనకి వార్నింగిచ్చాడాయె. అదీ ఆ ఆనందానికి కారణం. పెళ్ళికూతురు మంగతాయారు కూడా చదువుకున్నదే. మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది. యిక రెండిళ్ళలో పెళ్ళి హడావిడయితే మొదలయి పోయింది. పెళ్ళి ముహూర్తం యింకానెల ఉందనగా పెళ్ళి కూతురి యింట్లో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. రెండువైపుల బంధుజనాలూ పొలోమని వచ్చేశారు. వెంకటేశానికయితే మేడ మీద గది ఏర్పాటు చేశారు. నిశ్చితార్థం అయిం తర్వాత భోజనాల కార్యక్రమం మొదలయింది. సరిగ్గా అప్పుడు జరిగిందది. పైగదిలో ఉన్న వెంకటేశం తనకి మేనమామ వరసయిన భోళా సుబ్బారావుని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. యింకేముంది.. ఆ సుబ్బారావు కాస్తా హుషారుగా భోజనాల దగ్గరకి నడిచాడు. అప్పుడే భోజనాలు మొదలవుతాయి. సుబ్బారావు కూడా ఆ పంక్తి మధ్యలో దూరాడు. ఓసారి అటూ యిటూ చూసి అప్పుడు రంగంలోకి దూకాడు. పక్కనున్న గోవిందంతో ”యిదిగో గోవిందం.. రోజులు మారిపోతున్నా యనుకో. యిప్పుడు జరిగేవన్నీ బుడబుక్కల పెళ్ళిళ్ళే. లేకపోతే నిశ్చితార్థానికి ఈ తిండేంటంట? అన్నదానంలో పడేసినట్టు..” అంటూ ఆపాడు. భోళా సుబ్బారావు మాటలు అక్కడ చిన్నపాటి సంచలనాన్ని రేపాయి. అంతా తినడం ఆపి ఆసక్తి చూడసాగారు. యింతలో సుబ్బారావు కొనసాగిస్తూ ”అసలు భోజనం… అందు లోనూ యిలాంటి నిశ్చితార్థంలో భోజనం అంటే ఎలా ఉండాలి? అదిరిపోవాలి. భోజనానికి ముందు ముంచి షర్బత్‌ యిస్తే ఎంత సమ్మగా ఉంటుందని యిక ప్లేటులో బూరె, బొబ్బట్లు, హల్వా ఉండవలసిందే. మరీ స్వీటుంటే హాటుండొద్దూ. అదీ ఓ మూల రకాల యితే  మరీ భేషుగ్గా ఉంటుంది. పులిహోరా, పాయసం సరే. యిక ఓ డజను కూరలన్నా లేకపోతే ప్లేటుకి నిండుదనం ఏవుంటుందని..” అన్నాడు. సుబ్బారావు అలా అంటుంటే అంతా నోరెళ్ళబెట్టారు. యిదేదో మంగతాయారు తరపు వాళ్ళకి కొంచెం యిబ్బందిగా, యింకా అవమానంగా అనిపించింది. దాంతో వాళ్ళలో కొందరు చిన్నగా వాదనలోకి దిగారు. ఈ హడావిడేదో లోపల గదిలో ఉన్న మంగతాయారుకి వినిపించింది. కిటికీలోంచి తొంగి చూస్తే విషయం ఏంటనేది అర్థమయింది. దాంతో అక్కడే అటూ యిటూ తిరుగుతున్న వెంట్రావుని దగ్గరికి పిలిచింది. ”చూశావా బాబోయ్‌… వాడి పైత్యం” అంది. దాంతో వెంకట్రావు ”అవు నమ్మా… అయినా అబ్బాయి తరపు వాళ్ళంతా అలాగే ఉన్నారు. వాళ్ళదేదో పైస్థాయి ఫ్యామిలీ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు” అన్నాడు. దాంతో మంగతాయారు ”ఆ మాటకొస్తే మనకేం తక్కువ… నువ్వోపని చెయ్యి బాబాయ్‌..” అంటూ ఏం చేయాలో చెప్పింది. దాంతో వెంకట్రావు గబగబా ఆ భోజనాల పంక్తి దగ్గరికి నడిచాడు. ఆపాటికి భోళా సుబ్బారావు యింకా చెలరేగిపోతున్నాడు. యింతలో వెంకట్రావు హఠాత్తుగా పెద్దనోరుపెట్టి జనాంతికంగా ”అయినా నిశ్చితార్థానికి యింత హడావిడేంటంట? అసలు మా అన్నయ్య ననాలి. నిశ్చితార్థానికి ఆకూ, వక్కా, పళ్ళూ, బట్టలూ యిస్తే సరి పోతుందంటే వినలేదు. మనిషికి  మూడొందలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టించాడు. యింత ఖర్చుపెట్టినా బొత్తిగా విలు వన్నది లేకుండా పోయింది” అన్నాడు. ఆ మాటలతో మంగ తాయారు తరపు బంధువులకి హుషారొచ్చింది. దాంతో వాళ్ళూ గొంతు కలిపారు. యింకోవైపు  సుబ్బారావుకీ సపోర్ట్‌ పెరిగింది. యింకో పది నిమిషాల్లో మరీ  కొట్టుకునేంత కాకపోయినా వాద నలు తారాస్థాయినందుకున్నాయి. సరిగ్గా అప్పుడే గిరీశం, మాజీ ఎమ్మెల్యే ఏడుకొండలు దిగబడ్డారు. ఓ రకంగా చెప్పాలంటే యిద్దరూ చెరోవైపూ పెళ్ళిపెద్దల్లా వ్యవహరిస్తున్నవాళ్ళు. గిరీశం ఎలాగా కుటుంబంలోనివాడే. యిక ఏడుకొండలయితే మంగతాయారు కుటుంబానికి బాగా సన్నిహితుడు. వాళ్ళిద్దరూ సరదగా మాట్లాడుకుంటూ చేతులు కలుపుకుని మరీ వచ్చారు. గిరీశం అక్కడ జరుగుతున్న పరిస్థితంతా చూశాడు. అప్పుడో తెలివయిన పనిచేశాడు. మేడమీద గదిలో ఉన్న వెంకటేశాన్నీ లోపల గదిలో ఉన్న మంగతాయారునీ పిలిపించాడు. యిద్దరూ వచ్చాక ఆ యిద్దరినీ పక్కపక్కనే నిలబెట్టాడు. దాంతో అక్కడ భోజనాల దగ్గర నడుస్తున్న గొడవేదో ఆగింది. అంతా ఆసక్తిగా వాళ్ళని చూడసాగారు. వెంకటేశం, మంగ తాయారు సిగ్గులొలకబోస్తూ ఒకళ్ళనొకళ్ళు దొంగచూపులు చూసుకుంటున్నారు. యికో పక్క యిద్దరి మొహాల్లో  సంతోషం కనపడు తోంది. యింతలో గిరీశం అందరి వంకా చూసి ”మీరందరూ గొడవలు పడడం ఎందుకంటా? రేపు పెళ్ళి చేసుకోబోయే  ఈ యిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూశారా?” అన్నాడు. దానికి అంతా తలూపారు. ఆ తర్వాత గిరీశం, ఏడుకొం డలు వచ్చి పంక్తిలో చేరారు. తర్వాత అంతా కబుర్లాడుకుంటూ భోజనాలు కానిచ్చేశారు.
 
———–
 
”గురూగారూ.. రాత్రి అలాంటి  పాత చింత కాయ పచ్చడిలాంటి కలొకటి వచ్చింది. నాకేవయినా కళ్యాణయోగం లాంటిదేవయినా వచ్చేసినట్టంటారా?” అన్నాడు వెంకటేశం నడుస్తూనే. ఆపాటికి పక్కనే నడుస్తున్న గిరీశం ”ఆ..నీకు ఉద్యోగం, సద్యోగం లేకుండా కళ్యాణయోగం ఎక్కడొచ్చేస్తుందంట? అందులోనూ మీ వాళ్ళం దరికీ చాలా గొప్ప ఫేమిలీ అన్న ఫీలింగొకటి” అన్నాడు. దాంతో వెంకటేశం గుర్రుమని ”యింతకీ  ఈ కల ఎందుకొచ్చినంటం టారు?” అన్నాడు. ఈసారి  గిరీశం కొద్దిగా ఆలోచించి ”యిందులో కొద్దిగా కలుషితమయిన పొలిటికల్‌ మిత్రలాభం వ్యవహారం ఒకటుందోయ్‌.. అదేదో నువ్వే చెబితే బాగుంటుంది” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ”అవును గురూగారూ.. నా కలనే తీసుకుంటే మీ ఆదేశం మీదటే ఆ భోళా సుబ్బారావు అలా రెచ్చిపోయుండొచ్చు. అయినా మీరు చివర్లో వచ్చి పరిస్థితి చక్కదిద్దినట్టు నటించారు. యిలాంటి పరిస్థితే రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల మధ్య నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రెండు మిత్రపక్షాలే. యిదంతా పైకి కనిపించేదే. అయితే అంత ర్లీనంగా జరిగేది వేరుగా ఉంది. ఈ పొత్తు వలన  రెండుపార్టీలకూ ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందనేది వాస్తవమే. అలాగే యింకో పక్క రెండు పార్టీల్లోనూ ‘తాము గొప్ప’ అన్న భావం బలంగా ఉంది. అందుకే రెండు పార్టీల్లోనూ ఒకస్థాయి నాయకులు అవతలి పార్టీని తక్కువ చేసే స్థాయిలో విమర్శించడం గమనించ వచ్చును. నానీనే తీసుకున్నప్పుడు బీజేపీతో పొత్తు వలనే తనకి రావలసినంత మెజారిటీ రాలేదనీ ఆ పొత్తేదో లేకపోతే బ్రహ్మాండ మయిన మెజారిటీ వస్తుందనీ చెప్పాడు. యింకా యిక్కడి నాయకుల్లోనూ యిదే తీరు గమనించొచ్చు. యిదంతా ఆయా పార్టీలలో పైస్థాయిలో నాయకుల అనుమతి లేకుండానే  జరుగు తుందా అని…! ఖచ్చితంగా పై స్థాయిలో తెలిసే జరుగుతుంది. ఈ రెండు పార్టీలలో అన్ని స్థాయిల్లో నాయకుల మధ్యా మాటల యుద్ధం ఓ పక్కన జరుగుతుంటే యింకో పక్క బాబు, అమిత్‌ షా ఒకే స్టేజ్‌ మీద చేతులూపుకుంటూ, చిరునవ్వులు చిందిస్తూ తమ మిత్రత్వాన్ని ప్రకటించారు. దీన్నెలా తీసుకోవాలి? ‘ఆల్‌ యిన్‌ ది గేమ్‌’ అనేలాంటి ఓ స్ట్రాటజీ యిది. పొత్తు కొనసాగుతూనే ఉండాలి. తెగిపోకూడదు. యింకోపక్క తమ పార్టీ ఆధిపత్యం గురించి  అవ తలి పార్టీకి సంకేతాలు వెళ్ళాలి. అందుకే యిలా కిందస్థాయిలో విమర్శలూ, పై స్థాయిలో పెద్ద నాయకులు కౌగలింతలూ..” అంటూ వివరించాడు. వెంకటేశం వివరణకి గిరీశం నోరెళ్ళబెట్టాడు.
 
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి