రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం 

0
27
యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి వరప్రసాద్‌
రాజమహేంద్రవరం,డిసెంబర్‌ 23 :  అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌గాంధీ నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఓట్ల వరప్రసాద్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ  పార్టీని పటిష్టపర్చే క్రమంలో రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదును ఈ నెలాఖరుకు ప్రారంభిస్తామన్నారు. అన్ని వర్గాలకు పదవులు లభించేలా ప్రణాళిక సిద్ధం చేశామని, నాయకులు అనేవారు కార్యకర్తలతో ఎంపిక కావాలనే సూత్రాన్ని పాటిస్తున్నామన్నారు. జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు బోడా వెంకట్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ డైరక్టర్‌ ముళ్ళ మాధవ్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఏకె అర్షద్‌, గోలి రవి, అనుదీప్‌, దూలం ప్రసాద్‌, కొండబాబు,  వంశీ, రాజేష్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here