పేదలకు వస్త్రదానం ప్రశంసనీయం

9

వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం, జనవరి 11 : పండుగను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకునేందుకు వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ ద్వారా పేదవారికి వస్త్రాలను బహుకరించడం మార్గదర్శకమని శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. పుష్కరఘాట్‌ వద్ద వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ కార్యక్రమాన్ని రెండవరోజు ఆదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా వ్యయప్రయాసలకోర్చి స్వర్ణాంధ్ర రాంబాబు సారథ్యంలో వివిధ సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏడాది పొడవునా వస్త్రాలను సేకరించి శుభ్రపర్చి పండుగ రోజుల్లో వివిధ ప్రాంతాల్లోని పేదలకు అందిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ, హెల్పింగ్‌ హ్యాండ్స్‌, జైన్‌ సేవా సమితి, జెసిఐ, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులను ఆయన అభినందించారు. రేపు వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ కార్యక్రమాన్ని క్వారీ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు గుబ్బల రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అడ్మిన్‌ అనూప్‌జైన్‌, జైన్‌ సేవా సమితి నిర్వాహకులు విక్రమ్‌జైన్‌, నగర ప్రముఖులు నయనాల కృష్ణారావు, షేక్‌ సుభాన్‌, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ మెంబర్‌ ఫణీంద్రబాబి, ఓఎన్‌జీసి రాజు, శ్రీకన్య గ్రాండ్‌ అధినేత వి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.