14న అయ్యప్పస్వామి తిరువాభరణోత్సవం

17

దవులూరి రామక ష్ణ ఇంటి నుంచి ఊరేగింపు

రాజమహేంద్రవరం, జనవరి 11 : గత ఆరేళ్లుగా చేస్తున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా జనవరి 14న అయ్యప్ప స్వామి తిరువాభరణోత్సవం జరుగుతుందని, ప్రముఖ సంఘ సేవకులు దవులూరి రామక ష్ణ ఇంటినుంచి జరిగే ఊరేగింపును జయప్రదం చేయాలని శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధులు కోరారు. గౌతమఘాట్‌ రోడ్‌లోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, చల్లా శంకరరావు, పొలసానపల్లి హనుమంతరావు,మంతెన కేశవరాజు, దవులూరి రామక ష్ణ హజరయ్యారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ శబరిమలై తరహాలో ఇక్కడ నిత్యపూజలు, విశేష పూజలు నిర్వహిస్తున్నారని, దాతల సహకారంతో విజయదశమి నుంచి సంక్రాంతి వరకూ నిత్యాన్నదానం చేస్తున్నామని వివరించారు. ప్రతినెలా సంకట హర చతుర్థి పూజలు,ప్రతిరోజూ గణపతి హోమము తాంత్రిక విధానంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. 14వ తేదీ మధ్యాహ్నం షెల్టాన్‌ హోటల్‌ వెనుక రహ్మత్‌ నగర్‌ లోని దవులూరి రామక ష్ణ ఇంటినుంచి తిరువాభరణాలతో ఊరేగింపు జరుగుతుందని, సాయంత్రం ఆభరణాలను స్వామివారికి అలంకరించాక, 6.45గంటలకు మకరజ్యోతి దర్శనం ఉంటుందని ఆమె తెలిపారు. చల్లా శంకరరావు మాట్లాడుతూ 14వ తేదీ మధ్యాహ్నం తిరువాభరణాలతో రహ్మత్‌ నగర్‌ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌,పాతసోమాలమ్మ గుడి ,రామాలయం సెంటర్‌, ప్రకాష్‌ నగర్‌ లోని జక్కంపూడి నివాసం,టిటిడి కల్యాణ మంటపం రోడ్డు, కంబాలచెరువు, దేవీచౌక్‌, లక్ష్మీవారపు పేట, కోటగుమ్మం, మెయిన్‌ రోడ్డు, జోడుగుళ్ళు మీదుగా గౌతమ ఘాట్‌లోని అయ్యప్ప ఆలయానికి చేరుతుందని వివరించారు. స్వామివారికి ఆభరణాలు అలంకరించాక, భక్తులకు దర్శనం కల్పిస్తారని తెలిపారు. అయ్యప్ప ఆలయంలో ప్రతియేటా విజయదశమి నుంచి అయ్యప్ప్ప భక్తులకు చేస్తున్న అన్నదానం ఈ ఏడాది కూడా మొదలుపెట్టి ఒక లక్షా 40వేలమందికి భోజనాలు పెట్టినట్లు శంకరరావు చెప్పారు. వదాన్యుల సహకారంతో నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడమే కాక భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా కోటి రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 50లక్షల రూపాయలు డిపాజిట్‌ చేసినట్లు ఆయన తెలిపారు. పొలసానపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ఈ ఆలయంలో ప్రతియేటా విజయదశమి నుంచి సంక్రాంతి వరకూ నిత్యాన్నదానం కొనసాగించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కోటి రూపాయలతో నిధిని ఏర్పాటుచేయాలని నిర్ణయించి, ఇప్పటికే రూ.50లక్షలు డిపాజిట్‌ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా మెడికల్‌ క్యాంపులు కూడా నెలనెలా పెట్టాలని భావిస్తున్నామని, సంక్రాంతి తర్వాత దీనికి శ్రీకారం చుడతామని చెప్పారు. మంతెన కేశవరాజు మాట్లాడుతూ తిరువాభరణం మహోత్సవానికి మంచి తోడ్పాటు అందించాలని కోరారు. ముఖ్యంగా నగలు తెచ్చి, మళ్ళీ తీసుకెళ్ళేవరకూ పోలీసులు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. దవులూరి రామక ష్ణ మాట్లాడుతూ 18వ సారి అయ్యప్ప సన్నిధికి వెళ్తున్న తనకు తిరువాభరణాలు మోసే అద ష్టం దక్కడం ఆనందంగా ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ఇమంది మోహనరావు, చలపతి గురుస్వామి, బండారు రామారావు తదితరులు పాల్గొన్నారు.