ఇకపై ప్రతి నెలా వాల్‌ ఆఫ్‌ హ్యాపీినెస్‌

9

దేవీచౌక్‌లో భవన నిర్మాణ కార్మికులకు దుస్తుల పంపిణీ

రాజమహేంద్రవరం, జనవరి 12 : పేదలకు వస్త్రాలు అందించే వాల్‌ ఆఫ్‌ హ్యాపినెస్‌ కార్యక్రమాన్ని ఈరోజు లాలాచెరువు కూడలిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధరరావు, మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు ప్రారంభించారు. గత మూడు రోజులుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ, హెల్పింగ్‌ హ్యాండ్స్‌, జైన్‌ సేవా సమితి, జెసిఐ, లయన్స్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిరుపేదలకు వస్త్రాలు అందించడం అభినందనీయమని వారన్నారు. దాతలు కూడా స్పందించి వినియోగించిన వస్త్రాలను అందిస్తూ కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని అన్నారు. రేపు కూడా లాలాచెరువులోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఇకపై ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్వర్ణాంధ్ర వ్యవస్థాపక కార్యదర్శి లయన్‌ గుబ్బల రాంబాబు తెలిపారు. ఈ రోజు ఉదయం దేవీచౌక్‌లో ఈ కార్యక్రమాన్ని తలపెట్టి భవన నిర్మాణ కార్మికులకు పెద్ద ఎత్తున వస్త్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి ఉద్యోగులు ఎం.ఎఫ్‌ బెనర్జీ, ఎస్‌. గన్నెయ్య, ఎలిపే శ్రీనివాస్‌, ఓఎన్‌జీసి రాజు, గారా చంటిబాబు స్వర్ణాంధ్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.