వివేకానందకు రౌతు నివాళి

4

రాజమహేంద్రవరం, జనవరి 12 : యువతకు స్వామి వివేకానంద జీవితం స్పూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే, వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. చిన్న వయసులోనే ప్రపంచ మేధావులతో అభినందనలు పొందిన భారతీయ మేధావి వివేకానంద అని ఆయన అన్నారు. స్వామి వివేకానందా జయంతిని పురస్కరించుకుని కంబాలచెరువు వద్ద ఉన్న వివేకానందుని విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.