లోపాలు సరిదిద్దకపోతే గోదావరి జిల్లాల చిరునామా గల్లంతే

21

పోలవరం నిర్మాణంపై మాజీ ఎంపి హర్షకుమార్‌

రాజమహేంద్రవరం, జనవరి 12 :పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం లోప భూయిష్టంగా జరుగుతోందని మాజీ ఎంపి జీవి హర్షకుమార్‌ అన్నారు. కాఫర్‌ డ్యాం ఎత్తును 41 మీటర్లకు పెంచటం వల్ల ఉభయగోదావరి జిల్లాలకు పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలవరం కాఫర్‌ డ్యామ్‌కు గండి పడితే కాకినాడ, భీమవరం పట్టణాలు కూడా కనిపించవన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పరిధిలోని ఉభయగోదావరి జిల్లాల ప్రజల ప్రాణలకు భద్రత ఉండాలన్నారు. ఇటీవల కాళేశ్వరం పనులను ప్రశంసించిన సీడబ్ల్యుసీ ఇంజనీర్లు పోలవరం పనులను ఎందుకు మెచ్చుకోలేదని ఆయన ప్రశ్నించారు. పోలవరం డయాఫ్రామ్‌ వాల్‌ కింద గాలి బుడగలు ఉండటం ప్రమాదకరమన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడితే పోలవరం ఇంజనీర్లు భవిష్యత్తులో జైలుకు వెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో రామినీడు మురళి పాల్గొన్నారు.