కోర్టు ఆదేశాలకే కట్టుబడి ఉన్నాం

70

కోడి పందేలపై ఉప ముఖ్యమంత్రి రాజప్ప

రాజమహేంద్రవరం, జనవరి 12 : సంక్రాంతి అందరికీ పెద్ద పండుగని, అయితే కోడి పందేల నిర్వహణలో కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే సంక్రాంతి సందడిని తీసుకొచ్చిందని, ముగ్గుల పోటీలు, పాల పోటీలు నిర్వహించామన్నారు. రానున్న రెండు రోజుల్లో మండల స్థాయిలో వివిధ పోటీలు నిర్వహిస్తామన్నారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని భావించి ఇప్పటికే చంద్రన్న సంక్రాంతి సరకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. సంక్రాంతి అనగానే సంప్రదాయమైన కోడి పందేలు గుర్తుకొస్తాయని, అయితే వాటికి కోర్టు బ్రేక్‌ వేసిందని, కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించవలసిన అవసరం ఉందన్నారు.