మంత్రిపై విమర్శలకు ఫోటోగ్రాఫర్లు నిరసన

34

రాజమహేంద్రవరం, జనవరి 13 : ఫోటోగ్రఫీ వృత్తిని అవమానపర్చే విధంగా ఒకప్పుడు ఫోటోగ్రాఫర్‌గా వృత్తినిర్వహించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుపై తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరశిస్తూ రాజమండ్రి జోన్‌ ఫోటోగ్రాఫర్స్‌, వీడియో గ్రాఫర్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో దేవీచౌక్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్లు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోషియేషన్‌ గౌరవ అధ్యక్షులు అల్లు బాబి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ వృత్తిని అవమానించిన శ్రీనివాస్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.