44వ రోజుకు చేరుకున్న దీక్షలు

0
26

రాజమహేంద్రవరం, జనవరి 22 : స్ధానిక 44,47 డివిజన్‌ల పరిధిలోని ఇందిరాసత్యనగర్‌ పుంత వాసులు కొనసాగిస్తున్న దీక్షలు సోమవారం 44వ రోజు కూడా కొనసాగాయి. 44వ రోజు దీక్షా శిబిరాన్ని బిసి సంక్షేమసంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి కొల్లివెలసి హారిక ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యపై స్పందించాలని, న్యాయం చేయాలని బాధితులు నినదించారు. తమ ఉద్యమ ఉధృతికి సంబంధించి కార్యాచరణను త్వరలోనే తెలియచేస్తామని కొల్లివెలసి హారిక తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here