పూర్తయిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం పరిశీలన

0
14

కమిషనర్‌ను కలిసిన సభ్యులు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23 : నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం పరిశీలన పూర్తయింది. గత నాలుగు రోజులుగా కార్వీ సంస్థకు చెందిన సర్వేక్షణ్‌ పరిశీలకులు వి.సత్యసాయి నేతృత్వంలో నగరానికి వచ్చిన బృందం 50 డివిజన్లలో పర్యటించి నిశితంగా పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. టీమ్‌ లీడర్‌ సత్యసాయి నగర పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పరిశీలన పూర్తయ్యాక బృంద సభ్యులు నగర పాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఆరు నెలలుగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేసి ప్రజలను చైతన్య పర్చారని, నగరం ఇదే విధంగా పరిశుభ్రతగా ఉండేందుకు నిరంతరం సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ఎన్‌.వి.వి. సత్య నారాయణ, రెవెన్యూ అధికారి చాపల శ్రీనివాసరావు, శానిటరీ సూపర్వైజర్‌ నారాయణరావు, ఇంద్రగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here