మైనింగ్‌ బాధితులను ఆదుకోవాలి

0
22

రాజమహేంద్రవరం, మార్చి 1 : వేమగిరిలో అక్రమ మైనింగ్‌ వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునే వరకు పోరాటం చేస్తామని స్థానిక నాయకులు బడుగు ప్రశాంతకుమార్‌, దళిత నాయకులు పీతల జయబాబు, సతీష్‌చంద్ర అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో అక్రమ మైనింగ్‌ జరపడంతోపాటు చుట్టుప్రక్కల నివాసాలు దెబ్బతినేలా వ్యవహరించిన దోషులను కఠినంగా శిక్షించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇప్పటికే బాధితులకు అండగా మాజీ ఎం.పి. జి.వి.హర్షకుమార్‌ నిలిచారని, ఈనెల 3వ తేదీలోగా బాధితులకు న్యాయం చేయకపోతే 5వ తేదీన దండయాత్ర చేపడతామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పిల్లి సుబ్రహ్మణ్యం, సోమరాజు, పలివెల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here