జయేంద్ర సరస్వతి మహా సమాధి

2

కాంచీపురం, మార్చి 1 : అసంఖ్యాక భక్తజనం కన్నీటి వీడ్కోలు మధ్య కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి పార్థివ దేహం బృందావన ప్రవేశం ఈ ఉదయం గంభీర వాతావరణం నడుమ సాగింది. జయేంద్ర సరస్వతి కార్యస్ధానమైన కాంచీపురంలోని మఠం ప్రాంగణంలో ఈ అంతిమ సంస్కారాలు జరిగాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి సమాధి పక్కనే జయేంద్ర సరస్వతి పార్థివ దేహాన్ని సంప్రదాయ పద్ధతిలో సమాధి చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న జయేంద్ర సరస్వతి స్వామిజీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం వేకువజామున ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఏపీ,కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి పలువురు భక్తులు కాంచీపురం చేరుకుని స్వామిజీని కడపటి సారిగా సందర్శించి భక్త్యాంజలి ఘటించారు. అనంతరం సమాధి కార్యక్రమం నిర్వహించారు.