విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు అంగన్‌వాడీల మద్దతు

0
19

రాజమహేంద్రవరం, మార్చి 6 : డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఆందోళన చేస్తున్న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు ఏపీ అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ మద్దతు తెలిపింది. ఈరోజు ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు మద్దతు తెలుపుతూ కొద్దిసేపు అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. న్యాయపరమైన విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, వినోలియా, రత్నం, పద్మజావల్లి, సునీత, చింతలదేవి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here