హ్యాపీ సండేలో పోలియో చుక్కలు

0
13

రాజమహేంద్రవరం, మార్చి 11 : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాపీ సండేలో పల్స్‌ పోలియో కార్యక్రమం తలపెట్టారు. ఐదేళ్ళలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసారు. కార్పొరేటర్లు గొర్రెల సురేష్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌లు చిన్నారులకు పోలియో చుక్కలు వేసారు. నగరపాలక సంస్థ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎం.వి.ఆర్‌.మూర్తి పోలియో చుక్కల ప్రాముఖ్యతను వివరించారు. తల్లిదండ్రులు పోలియో చుక్కలను తప్పనిసరిగా పిల్లలకు వేయించాలని కార్పొరేటర్లు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here