శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాల్ని ప్రారంభించిన గన్ని కృష్ణ

4

రాజమహేంద్రవరం, మార్చి 12 : రాజమహేంద్రవరం గ్రామదేవత శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ (సోమాలమ్మ) అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా గుడా చైర్మన్‌ గన్నికృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసి ఉత్సవాలకు ప్రారంభోత్సవం చేశారు. ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు ఆలయ ముఖద్వారం ప్రారంభించారు. వీరికి ఆలయ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు రెడ్డిరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి జి.ఎస్‌.రమేష్‌ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి గన్నికృష్ణ, చల్లా శంకరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని గన్ని కోరారు. కార్యక్రమంలో మార్కండేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ రుంకాని వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు మజ్జి పద్మ, కురగంటి ఈశ్వరి, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, ఆర్యాపురం బ్యాంక్‌ డైరెక్టర్‌ సూరంపూడి శ్రీహరి, ఉత్సవ కమిటీ సభ్యులు గొర్రెల రమణ, రెడ్డి మణి, బొంతు సత్యనారాయణ, వల్లు గోవిందు, నరాల రమణమూర్తి, కేతా నాగేశ్వరరావు, కాండ్రేగుల ఏడుకొండలు, కాకి చిన్ని, బాబి, ఎం. వీరభద్రరావు, చింతపల్లి మోహన్‌, బుజ్జి, కందుల వాసు, వాసంశెట్టి సత్యనారాయణ, పుట్టా వెంకట రమణ పాల్గొన్నారని రమేష్‌ తెలిపారు.