జిల్లా నుంచి జాతీయ స్ధాయికి…

5

యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శిగా అర్షద్‌

పలువురు నేతల అభినందనలు

రాజమహేంద్రవరం, మార్చి 12 : అఖిల భారత యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా ఎస్‌ఎకె అర్షద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి జనార్ధన దివేది నుంచి అర్షద్‌కు ఉత్తర్వులు అందాయి. సుదీర్ఘకాలంగా ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్‌లో అర్షద్‌ అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అఖిల భారత స్దాయిలో పదవి దక్కింది. జిల్లా నుంచి జాతీయ స్ధాయిలో యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా నియమితులైన మొట్టమొదటి యువజన నాయకుడు అర్షద్‌. వీరి తండ్రి అసదుల్లా అహ్మద్‌ కాంగ్రెస్‌ పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌లో అనేక పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించారు. తండ్రి బాటలోనే కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తూ విద్యార్ధి విభాగం నుంచి, యువజన విభాగం వరకు అనేక పదవులను అర్షద్‌ నిర్వహిస్తూ, విద్యార్ధులు, యువజనుల సమస్యలపై పనిచేస్తున్నారు. 2012లో యువజన కాంగ్రెస్‌ పదవులకు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహించగా అర్షద్‌ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా అత్యధిక మెజార్టీతో గెలతుపొందారు. 2015లో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. అర్షద్‌కు అఖిల భారత యువజన కాంగ్రెస్‌ పదవి దక్కడం పట్ల ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, ఎస్‌ఎన్‌ రాజా, జిల్లా అధ్యక్షులు పంతం నానాజీ, కాంగ్రెస్‌ శిక్షణా తరగతులు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ రామినీడి మురళి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌ తదితరులు స్ధానిక ఆనంద్‌ రీజెన్సీలో జరిగిన కార్యక్రమంలో అభినందనలు తెలియజేసారు. మన జిల్లా నుంచి యువజన కాంగ్రెస్‌లో జాతీయ స్ధాయికి ఎదగడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ¬దాకొరకు పోరాటం సాగుతున్న నేపధ్యంలో జాతీయ యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి అర్షద్‌ నేతృత్వంలో పెద్దఎత్తున యువతను పోరాటంలో భాగస్వామ్యం చేయడానికి అవకాశం దక్కిందన్నారు. సామాన్య వ్యక్తులకు కూడా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నత పదవులు దక్కుతాయనడానికి అర్షద్‌కు పదవి రావడమే నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా ఎంతో మంది బలహీన వర్గాల వారికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు దక్కాయని గుర్తుచేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు పూలమాలలు, బొకేలు, శాలువాలతో అర్షద్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి సోడదాసి మార్టిన్‌ లూధర్‌, కార్యదర్శులు దాసి వెంకట్రావు, ముళ్ళ మాధవ్‌, అబ్దుల్లా షరీఫ్‌, యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఎస్‌ఎకె అర్షద్‌, అంకం గోపి, కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌, అసదుల్లా అహ్మద్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బోడా వెంకట్‌, నలబాటి శ్యామ్‌, గోలి రవి, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, నరాల లక్ష్మీ పార్వతి, బాలేపల్లి మురళీధర్‌, కాటం రవి, చాపల చినరాజు, ఎస్‌కె సుభానీ, బబ్లూ, పట్టాబి, మోహిత్‌, సునీల్‌, రవీంద్ర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొని అర్షద్‌ను అభినందించారు.