జె.కె.గార్డెన్ లో ఇండియా జ్యూయలరీ ఫెయిర్

48

రాజమహేంద్రవరం, మార్చి 13 : మహిళల అలంకరణకు, వివాహాలకు అవసరమైన ఎన్నో రకాల డిజైన్లతో అదితి ఈవెంట్స్‌ ఎక్స్‌పోజిషన్స్‌ ఆధ్వర్యంలో జె.ఎన్‌.రోడ్డులోని జె.కె.గార్డెన్స్‌లో ఇండియా జ్యూయలరీ ఫెయిర్‌ పేరుతో గోల్డ్‌, డైమండ్‌ డిజైనరీ జ్యూయలర్స్‌ ప్రదర్శన, అమ్మకాలు ప్రారంభించారు.నేటి నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను నగరంలోని ప్రముఖ మహిళలు సాయిరెడ్డి, డాక్టర్‌ ప్రతిమ, ఎం.లక్ష్మి ఆండాళ్‌, గాదె భువనేశ్వరి దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి డిజైన్లు కలిగిన బంగారు, వజ్రాభరణాల కోసం హైదరాబాద్‌, ముంబాయి, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉండేదని, ఇప్పుడు అదితి ఈవెంట్స్‌ ఎక్స్‌పోజిషన్స్‌ సంస్ధ ప్రముఖమైన సంస్ధలను రాజమహేంద్రవరానికి తీసుకొచ్చి వేలాది డిజైన్లను అందుబాటులో తేవడం ఆనందంగా ఉందన్నారు. అదితి ఈవెంట్స్‌ సిఇఓ శివ రామారావు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో ఢిల్లి, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యూయలరీ సంస్ధలు పాల్గొన్నాయని తెలిపారు. ఎక్స్‌ క్లూజివ్‌గా గోల్డ్‌, డైమండ్‌ జ్యూయలరీని అందుబాటులో ఉంచామని, వివాహాలకు అవసరమైన వివిధ రకాల బంగారు, వజ్రాభరణాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.