సబ్‌ కలెక్టరేట్‌ వద్ద పంచాయితీ కార్మికుల ధర్నా

7

రాజమహేంద్రవరం, మార్చి 13 : పంచాయితీ కార్మికుల వేతనాలు తగ్గించేలా ఉన్న కలెక్టర్‌ యూఓ నోట్‌ నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గ్రామ పంచాయితీ కార్మికులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.భీమేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ వంటి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఈ పథకంలో నిజమైన చాకిరి చేస్తున్న గ్రామ పంచాయితీ కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే పంచాయితీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్యదర్శి బి.ప్రేమ్‌కుమార్‌, జె. దుర్గారావు, వి.సత్యనారాయణ, ఐ చిరంజీవి, ఎం.రమేష్‌ పాల్గొన్నారు.