గణేష్‌ చెస్‌ అకాడెమీలో రేపటి నుంచి వేసవి శిక్షణ శిబిరం

7

రాజమహేంద్రవరం, మార్చి 13 : తిలక్‌ రోడ్డు ప్రశాంతి ఎస్టేట్‌లోని గణేష్‌ అకాడెమీ ఆఫ్‌ చెస్‌లో వినోదాన్ని పంచుతూ, విజ్ఞానం పెంచేందుకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు అకాడెమీ వ్యవస్థాపకులు డివి గణేష్‌ చెప్పారు. చెస్‌ కోచ్‌ కె జగన్నాధరావుతో కల్సి ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 15 నుంచి 25 వరకూ మొదటి బ్యాచ్‌, ఏప్రియల్‌ 15నుంచి 25వరకూ రెండో బ్యాచ్‌, మే 1నుంచి 10వరకూ మూడో బ్యాచ్‌ ఇలా మూడు బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తామని ఆయన వివరించారు. 4 నుంచి 15 ఏళ్ళ వరకూ గల పిల్లలకు ఈ శిక్షణ శిబిరం ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి నుంచి నేషనల్‌ చైల్డ్‌ అవార్డు అందుకున్న దేవ్‌ షా ఏప్రియల్‌ 7 న ఈ శిక్షణ శిబిరానికి విచ్చేసి చెస్‌లో ప్రతిభ కనబరిచిన పిల్లలకు బహుమతులు అందిస్తారని చెప్పారు. వేసవి శిక్షణకు సంబంధించి ఇతర వివరాలకు 9619418927, 0883-2448927 నెంబర్లలో సంప్రదించాలని గణేష్‌ కోరారు.