నీట్‌,ఐఐఇలకు ఉచిత అవగాహన సదస్సు

9

రాజమహేంద్రవరం, మార్చి 14 : వేమన రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వైద్య విద్యకు అవసరమైన నీట్‌ ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్‌ విద్యకు అవసరమైన ఐఐటి ప్రవేశ పరీక్షలకు అవసరమైన అవగాహన కల్పించేందుకు అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు కర్రి వెంకట రామారెడ్డి, నిర్వాహకులు మండా సూర్యభాస్కరరెడ్డి, దారపు రామకృష్ణారెడ్డి, అకాడమి డైరెక్టర్‌ జిఆర్‌ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంటర్మీడియెడ్‌ పూర్తిచేసిన విద్యార్ధులకు బంగారు భవిష్యత్‌ కల్పించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు 18వ తేదీ ఆదివారం నుండి ప్రశాంత్స్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో అర్హులైన అధ్యాపకులతో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం చేశామని తెలిపారు. కులాలకు, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన విద్యార్ధులు బంగారు భవిష్యత్‌ సాధించేందుకు ప్రతి ఆదివారం నీట్‌, ఐఐటిలపై అవగాహన పొందాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు అకాడమీ మొబైల్‌ నెంబర్‌లు 83400 94288, 94948 12665 నందు సంప్రదించాల్సిందిగా కోరారు. విలేకరుల సమావేశంలో అధ్యాపకులు బిఎస్‌ సంతోష్‌, కె సరోజినీ, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.