బైబిల్‌ మిషన్‌ 51వ మహాసభలు

22

రాజమహేంద్రవరం, మార్చి 14 : స్ధానిక విఎల్‌పురం, మోరంపూడి రోడ్‌లో గల మార్గాని ఎస్టేట్‌లో బైబిల్‌ మిషన్‌ 51వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. బైబిల్‌ మిషన్‌ మహాసభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బైబిల్‌ మిషన్‌ ఉపాధ్యక్షులు రెవరెండ్‌ డాక్టర్‌ శామ్యూల్‌ కిరణ్‌ మాట్లాడుతూ ‘నేటి దినములందు చెడిపోవుచున్న మనిషి సన్మార్గమందు నడువ వలెనంటే మనిషి, దేవుని సర్వమును ఆలకించుట’ ఎంతో అవసరమన్నారు. యేసు నడిచిన మార్గము శాంతియుతమైనదని, ఇది మంచిదని చెప్పారు. రెవరెండ్‌ ఎన్‌ సత్యానందం, అధ్యక్షులు రెవరెండ్‌ డాక్టర్‌ ఎన్‌ యేసురత్నం, కార్యదర్శి ఉషాపాల్‌, ఆరాధన టివి ఎండి రీనా శామ్యూల్‌లు ఉపదేశించారు. రెవరెండ్‌ డాక్టర్‌ ఎన్‌ విజయరాజు అధ్యక్షులుగానూ, రెంవరెండ్‌ షారోన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఈ సభలు జరుగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిమంది ఈ సభలకు తరలివచ్చారు. సభకు హాజరైన వారందరికి మంచినీరు, ఉచిత భోజన ఏర్పాట్లు చేసారు. 13నుండి 15వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతాయి. స్ధానిక విశ్వాసులు, సుదర్శన్‌ షాపింగ్‌ మాల్‌ అధినేత లావేటి సుదర్శన్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.