పవన్‌ను నమ్మితే నట్టేట మునిగినట్టే

12

ఎజెండా లేని జనసేనను నమ్మకండి : మేడా

రాజమహేంద్రవరం, మార్చి 14 : ఎటువంటి ఎజెండా లేకుండా ఏర్పడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీయేనని, ఫిలిం స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ను నమ్మి యువత మోసపోవద్దని రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్‌ వ్యవస్ధాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మేడా మాట్లాడుతూ ప్రత్యేక ¬దా, విభజన హామీలను నెరవేర్చని బిజేపిని, టిడిపిలను ప్రజలు నమ్మరన్నారు. గత ఎన్నికల ముందు పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలకు వెళ్ళకుండా బిజెపి, టిడిపిల విజయానికే పనిచేశారన్నారు. ఇప్పుడు కూడా ఆయన విధానాలు ఏమిటో స్పష్టత లేదన్నారు. పార్టీని రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు పార్టీ ఎజెండా ఏమిటో చెబుతారని అయితే ఎటువంటి ఎజెండా లేకుండా ఏర్పడ్డ పార్టీ ఒక్క జనసేన మాత్రమేనని ఎద్దేవా చేసారు. పవన్‌ కళ్యాణ్‌ ప్యాకేజీలకు అమ్ముడు పోయారని, అతడ్ని నమ్మి యువత మోసపోవద్దన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, మేధావులతో కలిసి ఏర్పాటుచేసిన ఫాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీ ఒట్టి పేక్‌ కమిటీ మాత్రమేనన్నారు. దాని వల్ల ఎటువంటి నిజాలు బైటకు రావన్నారు. రాష్ట్రానికి బిజెపి, టిడిపిలు చేసిన మోసం కన్నా, పవన్‌కళ్యాణ్‌ చేసిన మోసం ఎక్కువన్నారు. ఈరెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదని మేడా ప్రశ్నించారు. జనసేన అధ్యక్షులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసారు. ప్రత్యేక ¬దా అనేది ఆంధ్రుల హక్కు అని, దాన్ని సాధించేందుకు కొత్తతరంతో పోరాటాన్ని ముందుకు తీసుకువెళతామన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్ధానాల నుంచి శాసనసభకు కొత్తతరాన్ని పంపించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజాస్వామ్య వాదులందరిని కలుపుకుని ఏప్రిల్‌ 20న రాజమండ్రి వేదికగా ఒక సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో పెండ్యాల కామరాజు, బివి రమణరావు, కొత్తపల్లి భాస్కరరామ్‌, ఆర్‌కె చెట్టి, లంక దుర్గాప్రసాద్‌, కాసా రాజు, సిడి అబ్బాస్‌, ఎండి హుస్సేన్‌, ఖండవల్లి దుర్గాప్రసాద్‌; బర్ల ప్రసాద్‌, కొల్లి సిమ్మన్న, నల్లా వెంకటేష్‌లు పాల్గొన్నారు.