ఘనంగా నగర డాక్టర్స్‌ సెల్‌ కమిటీ ప్రమాణ స్వీకారం

రాజమహేంద్రవరం, మార్చి 20 : పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కేవలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమవుతుందని, అందుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలే నిదర్శనమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ గోసుల శివభరత్‌రెడ్డి అన్నారు. స్థానిక శేషయ్యమెట్టలోని సాయిరామ్‌ ఫంక్షన్‌ హాలులో ఈరోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర డాక్టర్స్‌ సెల్‌ కమిటీ ప్రమాణ స్వీకారం, అభినందన సభ నిర్వహించారు. పార్టీ సిటీ కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ సభకు విశిష్ట అతిధిగా పాల్గొన్న శివభరత్‌రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం, విద్యకు వైఎస్సార్‌ ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారని, పేదలు సైతం ధనవంతులతో సమానంగా కార్పొరేట్‌ ఆసుపత్రులలో వైద్యం చేయించుకునే సౌకర్యాన్ని కల్పించిన ఘనత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్‌ ఐదేళ్ళ పాలనను స్మరించుకుని రానున్న ఎన్నికల్లో రాజన్న రాజ్యం వచ్చేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచాలన్నారు. డాక్టర్స్‌ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వై.అశోక్‌బాబు, అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌.ఎం.భాషా, జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన కొనసాగించిన మహనీయుడు రాజశేఖరరెడ్డి అని, ఆయన హయాం ఒక స్వర్ణయుగమని కొనియాడారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలకు తెలుగుదేశం ప్రభుత్వం తూట్లు పొడిచిందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని పేరు మార్చినా అమలులో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయన్నారు. 108 వ్యవస్థను భ్రష్టుపట్టించారని, అవి లేకపోవడంతో అనేకమంది క్షతగాత్రులు సకాలానికి ఆసుపత్రికి చేరుకోకపోవడంతో మరణిస్తున్నారని తెలిపారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా జగన్మోహనరెడ్డి పేదల పక్షాన నిలుస్తున్నారని కొనియాడారు. వై.ఎస్‌.హయాంలో ప్రజారంజక పాలన జరిగిందని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వస్తే తిరిగి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు నవరత్నాల్లో ఆ అంశాన్ని చేర్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్‌ సెల్‌ నగర కమిటీ అధ్యక్షులు వి.వి.కృష్ణారావు, ఇతర కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, రాష్ట్ర గౌరవ సలహాదారులు కె.రవీంద్రనాధ్‌, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, ట్రేడ్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు నరవ గోపాలకృష్ణ, యువ నాయకులు జక్కంపూడి గణేష్‌, పోలు కిరణ్‌రెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బొంతా శ్రీహరి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, తామాడి సుశీల, పతివాడ రమేష్‌, కాటం రజనీకాంత్‌, వాకచర్ల కృష్ణ, ఉప్పాడ కోటరెడ్డి, మరుకుర్తి కుమార్‌, ఆరిఫ్‌, పెదిరెడ్ల శ్రీనివాస్‌, కట్టా సూర్యప్రకాశరావు, కానుబోయిన సాగర్‌, మారిశెట్టి వెంకటేశ్వరరావు, లంక సత్యనారాయణ, సంకిస భవానీప్రియ, అందనాపల్లి సత్యనారాయణ, పాలూరి శ్రీనివాసరావు, గాడాల శ్రీను, కంది రాఘవ, ఎస్‌.కె.ఖాన్‌, వై.వి.సత్యనారాయణమూర్తి, కర్రి తిరుపతిరెడ్డి, వై.యాదగిరి, అద్దంకి సూర్య, ఎస్‌.రామలక్ష్మణరావు, యలమంచిలి నాగరాజు, ఎం.శ్రీనివాస్‌, పేరూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.