రాజమహేంద్రవరం, మార్చి 25 : స్ధానిక శ్రీరామనగర్‌లోని శ్రీశ్రీశ్రీ సంకట హర వర సిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఉదయం సీతారాముల కల్యాణం సంప్రదాయబద్ధంగా అత్యంత వైభోపేతంగా జరిగింది. ఆలయ ధర్మకర్త, గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ, రాజ రాజేశ్వరి దంపతుల చేతుల మీదుగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలను ఉంచి సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణలతో సుందరంగా ముస్తాబు చేసి వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. ఉదయం సరిగ్గా 9.01 గంటలకు సుముహూర్తంగా నిర్ణయించి జరిపించిన ఈ కల్యాణానికి పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరై కనులారా వీక్షించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొంది తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఆదర్శ పురుషునిగా కోట్లాది మంది జనుల పూజలందుకుంటున్న శ్రీరామచంద్రమూర్తి జనన, కల్యాణ మహోత్సవాలను ఒకే రోజు జరుపుకోవడం అనాదిగా సంప్రదాయంగా వస్తుండగా ఈ అపూర్వ ఘట్టాన్ని నేత్ర పర్వంగా వీక్షించిన భక్తులు పునీతులయ్యారు. ఈ సందర్భంగా గన్ని దంపతులతో పాటు వారి కుమార్తె అన్నె స్మిత, మనుమడు ప్రణవ్‌ స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మీ, తెదేపా నాయకులు, మధురపూడి విమానాశ్రయం ఎడ్వైజరి బోర్డు మెంబర్‌ దళితరత్న కాశి నవీన్‌కుమార్‌,మార్ని వాసు, కొత్తూరి బాల నాగేశ్వరరావు, నిమ్మలపూడి గోవింద్‌, మళ్ళ వెంకట్రాజు, ఉప్పులూరి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. కల్యాణం అనంతరం భక్తులకు పానకం, ప్రసాదం వితరణ జరిగింది.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.