రాజమహేంద్రవరం, మార్చి 26 : నగరంలోని వివిధ దేవాలయాలు, ముఖ్య కూడళ్ళలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ పాల్గొన్నారు. ఆలయాల వద్ద ఆయా ఉత్సవ కమిటీలు ఆయనను సాదరంగా స్వాగతించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆయన ప్రార్ధించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు మనోధైర్యాన్ని, ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని కోరారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.