కేసుల సత్వర పరిష్కారానికే ఎసిబి కోర్టు

13

హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ వెల్లడి

రాజమహేంద్రవరం, మార్చి 31 : కోర్టుల ద్వారా సాధ్యమైనంత త్వరలో కేసులు పరిష్కారించేదుకు న్యాయమూర్తులు,న్యాయవాదులందరు సహకరించాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జి, తూర్పుగోదావరి అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి సి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కంబాలచెరువు మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్‌ కోర్టు ఫర్‌ ట్రయల్‌ ఆఫ్‌ యస్‌.పి.ఈ అండ్‌ ఎసిబి కోర్టును ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్బముగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ అవినీతికి సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కారించేదుకు ఈ కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటుచేయడం జరిగిందని, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన ఎసిబి కేసులను పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని అయన అన్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఎసిబి కోర్టులో ఉన్న 199 కేసులు ఉండగా, ఉభయ గోదావరికి సంబందించిన కేసులను కొత్తగా ఏర్పాటుచేసిన కోర్టుకు బదిలిచేయడం జరిగిందని తెలిపారు. మొదట అదనపు జిల్లా జడ్జి సి.హెచ్‌ కిషోర్‌ కుమార్‌కు ఎసిబి కోర్టు జడ్జిగా భాధ్యతలు అప్పగించడం జరిగిందని అన్నారు. ఈ సందర్బముగా జిల్లా జడ్జి ఎన్‌. తూకారాం జి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న ఎసిబి కోర్టు ను ఈరోజు ఏర్పాటుచేయడం గర్వకారణమని అయన అన్నారు. బార్‌ అసోసియేషన్‌ అథ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎసిబి కోర్టు రాజమహేంద్రవరంకి మంజూరు చేసిన వారందరికి కృతాజ్ఞతలు తెలియజేశారు. రాజమహేంద్రవరానికి మహిళా కోర్టు కూడా అవసరం ఉందని దానిని కూడా మంజూరు చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో జడ్జిలు రామకృష్ణ, శ్రీనివాసరావు, టి.శ్రీదేవి,యామిని, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. కోర్టు ప్రారంభం సందర్భంగా సర్వ మత ప్రార్ధనలు చేశారు.