సరదాగా సాగిన 75వ హ్యాపీ సండే

రాజమహేంద్రవరం, ఏప్రియల్‌ 1 : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం పుష్కర్‌ ఘాట్‌ వద్ద నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమం 75వ వారానికి చేరుకుంది. కమిషనర్‌ విజయరామరాజు సారధ్యంలో నిరాటంకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థకు పాఠశాలల విద్యార్ధులు, వివిధ డాన్స్‌ స్కూల్స్‌ విద్యార్ధులు తమ ప్రతిభను కనబరుచుకునేందుకు వేదికగా వినియోగించుకుంటున్నారు. అయితే పాఠశాలల విద్యార్ధులు డాన్స్‌ నేర్చుకునేందుకు నగరపాలక సంస్థ సాయి అనే డాన్స్‌ మాష్టర్‌ ని నియమించింది. దీని ద్వారా దేశభక్తి గీతాలు, సినీ, జానపద, సాంఘిక న త్యాలు, వివిధ అంశాలపై ప్రజలను చైతన్యపరచేలా నాటికలు ప్రదర్శిస్తూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని విజయవంతం చేస్తున్నారు. చదువుతో పాటు ఆట,పాటలు అవసరమని, దాని ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చని సూచిస్తున్నారు.75వ ఆనంద ఆదివారంలో భాగంగా ఈరోజు ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. నగరపాలక సంస్థ డాన్స్‌ మాష్టర్‌ సాయి ఫొటో కెమెరా ప్రాముఖ్యత వివరిస్తూ ప్రత్యేకంగా పెద్ద కెమెరా తయారు చేసి దానిని ప్రదర్శించి అందరూ అభినందించేలా చక్కని న త్యాలు ప్రదర్శించారు. భీమవరానికి చెందిన లిటిల్‌ హార్ట్స్‌ బ ందం చిన్నారుల హ ద్రోగ చికిత్సల నిమిత్తం ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. బ ందంలో సభ్యులు పలు ప్రదర్శనలు చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఓంకార్‌ న త్య నికేతన్‌ ఆధ్వర్యంలో చిన్నారులు మూడు పాటలకు సంప్రదాయ న త్యాలు ప్రదర్శించారు. శ్యామలాంబ యుపి స్కూల్‌, జాంపేట గరల్స్‌ ప్రాధమిక పాఠశాల, శారదా విద్యామందిర్‌, సంజీవయ్యనగర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్ధులతో పాటు గోదావరి బాయ్స్‌, మోడ్రన్‌ డాన్స్‌ అకాడమీ, ఈశ్వర్‌ డాన్స్‌ స్కూల్‌, విజయ్‌ డాన్స్‌ గ్రూప్‌, సంజయ్‌ డాన్స్‌ అకాడమీకి చెందిన విద్యార్ధులు, బ ంద సభ్యులు హుషారైన స్టెప్పులు వేసి అందరిలో జోష్‌ నింపారు. ఈ హ్యాపీ సండేలో నగరపాలక సంస్థ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎం.వి.ఆర్‌.మూర్తి, ఇడపలపాటి నరసింహారావులు కాయిన్స్‌, స్టాంప్స్‌ కలెక్షన్‌ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేనేజర్‌ చాపల శ్రీనివాసరావు, కార్యదర్శి శైలజావల్లీ, స్కూల్స్‌ సూపర్‌వైజర్‌ దుర్గాప్రసాద్‌ పాల్గొనగా విశ్రాంత ఉపాధ్యాయులు రాజేష్‌, ఉపాధ్యాయురాలు రమాదేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.