42వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

0
17

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5 : స్ధానిక 42 వ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి శ్రీకారం చుట్టారు. డివిజన్‌లోని రత్నంపేట వాంబే గృహాల వెనుక ఉన్న గోతుల్లో ఎవరూ పడిపోకుండా రూ. 12 లక్షలతో నిర్మించిన రక్షణ గోడను వారు ప్రారంభించారు. అనంతరం వాంబే గృహ సముదాయాల వద్ద రూ. 12 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణానికి, సంజీవయ్య పార్కు వద్ద రూ. 22.50 లక్షలతో నాలుగు వైపులా రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, స్థానిక కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మీ, దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, మళ్ళ వెంకట్రాజు, సెనివాడ అర్జున్‌, మొల్లి చిన్ని యాదవ్‌, ఎంఏ రషీద్‌, బిజెపి నాయకురాలు నాళం పద్మశ్రీ, అడ్డాల ఆదినారాయణమూర్తి, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here