వైకాపా నేతల జాతీయ రహదారుల దిగ్భందం

7

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 10 : రాజానగరం వద్ద జాతీయ రహదారిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో దిగ్భందించారు. రాజా మాట్లాడుతూ ఇన్ని రోజులు చంద్రబాబుకి గుర్తుకురాని ప్రత్యేక ¬దా ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఇప్పుడు గుర్తు వచ్చింది అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మండరపు వీర్రాజు, దేశాల శ్రీను, గండి నానిబాబు, ఉండమట్ల రాజు, రాజానగరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు 300 మంది పాల్గొన్నారు. బొమ్మూరు వద్ద జాతీయ రహదారిని వైఎస్సార్‌సిపి రూరల్‌ కోఆర్డినేటర్‌ గిరిజాల వీర్రాజు(బాబ్జి) ఆధ్వర్యంలో దిగ్భందనం చేసారు. రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా జాతీయ రహదారిని దిగ్భందించడంతో ఎక్కడిక్కడ వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.