ఎం.పి. మురళీమోహన్‌కి గన్ని సంఘీభావం

20

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 13 : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్‌లో అవిశ్రాంతంగా పోరాడి అస్వస్ధతకు గురై రాజమహేంద్రవరం తిరిగొచ్చిన లోక్‌సభ సభ్యుడు మాగంటి మురళీమోహన్‌ను గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఈరోజు వెంకటేశ్వరనగర్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి మొక్క అందించి సంఘీభావం తెలియజేశారు. రాష్ట్ర సమస్యలపై పోరాటానికి తమ మద్ధతు ఉంటుందని ఈ సందర్భంగా గన్ని తెలియజేశారు.