ఇంటర్‌లో కళాశాల టాపర్‌ మళ్ళ సుప్రియకు గన్ని అభినందనలు

67

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 13 : సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో బైపీసీ గ్రూప్‌లో వెయ్యికి 981 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్న శ్రీ చైతన్య కళాశాల విద్యార్థినీ మళ్ళ జయశ్రీ లక్ష్మీ సుప్రియకు గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌ గన్ని కృష్ణ అభినందనలు తెలియజేశారు. కళాశాల స్థాయిలో ప్రథమ స్ధానంలో నిలిచిన సుప్రియకు గన్ని ఈరోజు తన నివాసంలో వాచీ బహుకరించి అభినందనలు తెలియజేశారు. స్ధానిక 42 వ డివిజన్‌ తెదేపా అధ్యక్షులు మళ్ళ వెంకట్రాజు, కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మీ దంపతుల కుమార్తె సుప్రియ బాల్యం నుంచి చదువులో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తోంది. తన విజయంలో తల్లిదండ్రులతో పాటు తమ తాత,నాయనమ్మలు మళ్ళ వెంకన్న, లక్ష్మీ తులసిల సహకారం ఎంతో ఉందని సుప్రియ ఈ సందర్భంగా తెలియజేసింది.