అందరివాడు అంబేద్కర్‌

19

జయంతి సభలో పలువురు వక్తలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డా.బి. ఆర్‌.అంబేద్కర్‌ 127 వ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి నగరంలోని ప్రజాప్రతి నిధులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎం.పి. మురళీమోహన్‌, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేష సాయి, సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, రౌతు సూర్యప్రకాశరావు, దళితరత్న కాశీ నవీన్‌కుమార్‌, వివిధ దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్‌, సీపిఎం, సిపిఐ, జనసేన పార్టీల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సమానత్వం నెలకొల్పేం దుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.ఆయన కృషి వలనే బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారు వివిధ రంగాల్లో ఉన్నత స్ధానాల్లో ఉన్నారని, చట్ట సభల్లో వారు అడుగు పెట్టడానికి కూడా ఆయన కారకులన్నారు.