గొందేశి శ్రీనివాసులు రెడ్డికి అభినందనలు

53

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 14 : ది రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తమ అసోసియేషన్‌ లీగల్‌ ఎడ్వైజర్‌ గొందేశి శ్రీనివాసులురెడ్డిని ది అల్యూమినియం కాస్ట్‌వేర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోషియేషన్‌ సభ్యులు అభినందించారు. శ్రీనివాసులు రెడ్డిని కలిసి వారు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు, కార్పొరేటర్‌ కిలపర్తి శ్రీనివాస్‌, అధ్యక్షులు కంటిపూడి పాపారావు చౌదరి, ఉపాధ్యక్షులు కొల్లి దుర్గా ప్రసాద్‌, కార్యదర్శి తుంపెర్ల శంకరరావు, జాయింట్‌ సెక్రటరీ పట్టా నూకరాజు, కమిటీ సభ్యులు దంగేటి సత్యనారాయణ, కొత్తల భాస్కరరావు, మద్దుల శరభయ్య, గుండు రాజా, గాడిల్లి మల్లేశ్వరరావు, కరాచి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.