డాక్టర్‌ బొమ్మిరెడ్డి బ్రహ్మానందం కన్నుమూత

44

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 16 : ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ బొమ్మిరెడ్డి బ్రహ్మానందం ఈరోజు ఉదయం దానవాయిపేటలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె వున్నారు. కుమారుడు డాక్టర్‌ బొమ్మిరెడ్డి శ్రీనివాస్‌,కోడలు డాక్టర్‌ సుధ వైద్యులుగా నగరంలో రాణిస్తున్నారు. మరో కుమారుడు బొమ్మిరెడ్డి సత్యదేవ్‌, కోడలు వసుధ సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లుగా ఉన్నారు. కుమార్తె డాక్టర్‌ సజ్జా పద్మ,అల్లుడు డాక్టర్‌ శరత్‌ కుమార్‌ వైద్యులుగా రాణిస్తున్నారు. సీతానగరం మండలం ముగ్గుళ్ల గ్రామానికి చెందిన డాక్టర్‌ బ్రహ్మానందం వైద్య వ త్తిలో ప్రవేశించి, ఫిజీషియన్‌,ఫలమనాలజిస్ట్‌ విభాగంలో ప్రభుత్వ వైద్యునిగా సమర్ధవంతంగా సేవలందించారు. ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా సేవలందించి, పదవీ విరమణ చేసాక కూడా పలువురికి ఉచిత వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. తుదిశ్వాస విడిచేవరకూ వైద్య వ త్తిలో కొనసాగి, ఎందరికో వైద్యం అందించిన డాక్టర్‌ బ్రహ్మానందం మరణం పట్ల ఐ ఎం ఏ సభ్యులు, పలువురు వైద్యులు,ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.