నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోండి

16

గుడా చైర్మన్‌ గన్నిని కలిసిన ట్రాన్స్‌కో ఎస్‌.ఇ.

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 17 : వేసవి దృష్ట్యా జిల్లాలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ కోరారు. ఏపీ ట్రాన్స్‌కో జిల్లా ఎస్‌.ఇ.గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణరెడ్డి ఈరోజు మర్యాదపూర్వకంగా గుడా చైర్మన్‌ గన్ని కృష్ణను ఆయన నివాసంలో కలిశారు. విద్యుత్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై సత్వరమే స్పందించాలని కూడా గన్ని కోరారు.