కన్నమ్మ ఆలయాభివృద్ధికి దాతలు సహకరించాలి

0
16

సుందరీకరణ పనులకు రేపు శ్రీకారం : కార్పొరేటర్‌ మాధవిలత

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16 : స్ధానిక రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న శ్రీ కన్నమ్మ పేరంటాల అమ్మవారి దేవస్థానం ఆలయ పునర్మిర్మాణ పనులను పుష్కర నిధులతో చేపట్టినా దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించి అసంపూర్తిగా వదిలిపెట్టారు. దీంతో గత రెండేళ్ళుగా పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఆవేదనకు గురైన భక్తులు దాతల సహకారం ఈ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆలయ ప్రాకార స్తంభాలను సుందరీకరించే పనులను రేపు ప్రారంభించనున్నారు. అలాగే గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ పనులను 19 వ డివిజన్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులు చేపడుతున్నారు. ఇంకా మిగిలిన పనులను భక్తుల సహకారంతో పూర్తి చేసేందుకు స్ధానిక నాయకులు సంకల్పించారు. ఇందుకు భక్తులు సహకరించాలని కార్పొరేటర్‌ గొందేశి మాధవి హరినాథ్‌, ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here