సీతానగరంలో వినూత్నంగా జోలిపట్టిన జక్కంపూడి
రాజమహేంద్రవరం, మే 9 : సీతానగరం మండలం కాటవరం గ్రామంలో ఇసుక మాఫియా లారీ క్రింద పడి చనిపోయిన మామిడి దుర్గ అనే మహిళకు  అప్పుడిచ్చిన రూ.3.5 లక్షల హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కాటవరం గ్రామంలో వినూత్నంగా జోలి పట్టి నిరసన వ్యక్తం చేశారు. రేపు సీతానగరం మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులమీదుగా ఆ కుటుంబానికి రూ.లక్ష అందజేస్తామని తెలిపారు. తెదేపా నేతలకు ఇసుకపై వచ్చే డబ్బుపై ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ డాక్టర్‌ బాబు, వలవల రాజా, తోట లోవరాజు, పట్టపగలు ప్రసాద్‌, సుజీ రాజు, గెద్దాడ త్రిమూర్తులు, మల్లిన చౌదరి, ప్రసాద్‌రాజు, ముత్యాలు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.