ఆర్యాపురం బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ మార్గాని రామక ష్ణ గౌడ్‌ సూటి ప్రశ్న
రాజమహేంద్రవరం, మే 11 : ది ఆర్యాపురం కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు శత వసంతాల వేడుకల్లో బ్యాంకు అభివ ద్ధికి విశేషంగా క షి చేసిన మాజీ పాలకులను విస్మరించడం దారుణమని బ్యాంకు మాజీ డైరెక్టర్‌ మార్గాని రామక ష్ణ గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేసారు. శత వసంత వేడుకల్లో భాగంగా బ్యాంకు మెయిన్‌ బ్రాంచ్‌ భవనాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో బ్యాంకు ప్రగతికి విశేషంగా క షి చేసిన మాజీ చైర్మన్లను, డైరెక్టర్ల పేర్లను చేర్చక పోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బ్యాంకు ఈ స్ధితిలో ఉండటానికి క షి చేసిన వారిలో మాజీ చైర్మన్లు రాజారావు, పొన్నాడ చలపతిరావు, గన్ని సత్యనారాయణమూర్తి, యాళ్ళ సూర్యారావు, మజ్జి సోమినాయుడు, నందం సీతారామరాజు, తొక్కుల రామాంజనేయులతో పాటు డైరెక్టర్లుగా పని చేసిన జిత్‌ మోహన్‌ మిత్ర, ఇమ్మంది శ్రీరాములు, యజ్జవరపు మరిడయ్య, లంక సత్యనారాయణ వంటి వ్యక్తులు ఉన్నారని తెలిపారు. తాను 1970 నుంచి బ్యాంక్‌ సభ్యుడిగా ఉన్నానని, 2002, 2007లో డైరెక్టర్‌గా పనిచేసి నేటివరకు సేవలందించినట్లు తెలిపారు. అదేవిధంగా బ్యాంక్‌ అభివ ద్ధికి ముప్పై మూడున్నర సంవత్సరాలు పాటు క షి చేసిన సి.వి.ఎస్‌.సుబ్రహ్మణ్యంతో పాటు ఎందరో మేనేజర్లు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సేవలందించారని, అలాంటి వ్యక్తుల పేర్లు విస్మరించడం క్షమించరాని నేరమని అన్నారు. గతాన్ని విస్మరించి ఇప్పుడేదో బ్యాంకును తాము అభివ ద్ధి వైపు నడిపిస్తున్నామని చెప్పడం బాధాకరమని, ఈ అభివృద్ధికి గత పాలకులు, అధికారుల వల్లే ఇది సాధ్యమైందని చెప్పకపోవడం, పేర్లు ఆహ్వాన పత్రికలో చేర్చకపోవడం అన్యాయమన్నారు.గత పాలకవర్గాలు నీతి,నిజాయితీలతో వ్యవహరించి ఖాతాదారుల్లో నమ్మకం కలిగించి బ్యాంకును ఉన్నతమైన స్థానంలో నిలిపారని, అటువంటి మహనీయుల పేర్లను మరచి బ్యాంకుకు చెడ్డపేరు తేవడం మంచిది కాదన్నారు. ఈ విషయాలను ప్రజాప్రతినిధులు, బ్యాంకు సభ్యులు,డిపాజిటర్లు గమనించాలని గౌడ్‌ కోరారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.