సైకిల్‌ యాత్రలో నేతల పిలుపు
రాజమహేంద్రవరం, మే 11 : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, కుట్ర రాజకీయాలను వ్యతిరేకిస్తూ  ధర్మ పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా ఉండాలని తెదేపా నాయకులు పిలుపు ఇచ్చారు.  రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు  32 వ డివిజన్‌లో అధ్యక్షులు చప్పటి సత్యన్నారాయణ  ఆధ్వర్యంలో  సైకిల్‌ యాత్ర నిర్వహించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని,  బి.జె పి. వై.కా.పా, జనసేన చేస్తున్న కుట్ర రాజకీయాలను వారు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు,కార్పొరేటర్లుకు టీడీపీ యువనాయకులు ఆదిరెడ్డి వాసు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఎం.ఎల్‌.సి. ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ, మేయర్‌ పంతం రజని శేషసాయి సైకిల్‌ యాత్రకు జండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో  ఎస్‌.సి. కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశీ నవీన్‌, టీడీపీ సిటీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కార్పొరేటర్లు కోరిమిల్లి విజయశేఖర్‌, కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ సుభాన్‌, నాయకులు  కురగంటి సతీష్‌, ఛాన్‌ భాషా, హాబీబుల్లా, రవి యాదవ్‌, మేరపురెడ్డి రామక ష్ణ, మహబూబ్‌ ఖాన్‌, కర్రి రాంబాబు, గోవింద్‌, చౌదరి,పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.