రిలీవ్‌ అయిన కమిషనర్‌ విజయరామరాజు
రాజమహేంద్రవరం, మే 11 : నగరపాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు ఈరోజు తన బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. తిరుపతికి బదిలీ అయిన విజయరామరాజు తన బాద్యతలను అడిషినల్‌ కమిషనర్‌ సత్యనారాయణకు అప్పగించారు. నూతన కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ ఒకటి, రెండురోజుల్లో బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. విజయరామరాజుకు అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈరోజు ఉదయం ఆయన గన్నవరం వెళ్ళి అక్కడ నుంచి విమానంలో తిరుపతి పయనమయ్యారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.