పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌

0
8

రాజమహేంద్రవరం, జూన్‌ 12 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాల వారీగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాకినాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నామన రాంబాబు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, శాప్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, బిసి కార్పొరేషన్‌ డైరక్టర్‌ పెచ్చేటి చంద్రమౌళి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అధినేత సూచనలు స్వీకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి దిశా నిర్ధేశనం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here