ఘనంగా పార్టీ అధినేత జన్మదిన వేడుకలు
రాజమహేంద్రవరం, డిసెంబర్ 21 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి జనం పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సిపి సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. పార్టీ అధినేత జగన్ జన్మదినోత్సవ వేడుకలను జాంపేటలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కేక్‌ను రౌతు, పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ కట్ చేశారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ ప్రతిపక్షనేతగా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతూ జననేతగా నిలిచారని, ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలపై ఉద్యమిస్తూ ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలను ఎండగడుతున్నారన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలు ఎదుర్కొంటూ పోరాడుతున్న జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు. రాష్ట్ర ప్రజల చుక్కానిగా జగన్ ఉన్నారని, ఆయనను సీఎం చేయడంలో ప్రతి ఒక్కరూ సైనికునివలె పనిచేయాలని కోరారు. జాంపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ప్రాముఖ్యత ఉందని, 2004, 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో ఈ కార్యాలయం నుంచే ప్రధాన భూమిక పోషించడం జరిగిందన్నారు. మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీ శ్రేణులందరూ ఏకత్రాటిపై నడిచి పార్టీని అధికారంలోకి తెచ్చిన విధంగా ఇప్పుడు కూడా వై.ఎస్.జగన్మోహనరెడ్డిని సీఎం చేసేందుకు ఎటువంటి అరమరికలు లేకుండా ఏకోన్ముఖులు కావాలని సూచించారు. ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ఆయనకు పార్టీ శ్రేణులిచ్చే నిజమైన కానుక అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర చిన్ని మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పార్టీ శ్రేణులందరూ సైనికుల్లా పనిచేసి 2019 ఎన్నికల నాటికి పార్టీని పటిష్టపర్చాలని సూచించారు. అనంతరం వైఎస్సార్సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్ ఆధ్వర్యంలో కంబాలచెరువు సెంటర్లోని జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహం వద్ద జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెవిటి, మూగ పిల్లలకు దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. పుట్టినరోజు కేక్ కట్ చేసి వారికి పంచారు. ఈ సందర్భంగా పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మార్గంలోనే పయనిస్తూ నిత్యం ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధరరావు, కార్పొరేటర్లు ఈతకోట బాపన సుధారాణి, బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, పార్టీ నాయకులు దంగేటి వీరబాబు, పోలు కిరణ్‌రెడ్డి, వాకచర్ల కృష్ణ, రాయపురెడ్డి చిన్న, జక్కంపూడి గణేష్, చిక్కాల బాబులు, మార్తి నాగేశ్వరరావు, ముప్పన శ్రీనివాస్, ఉప్పాడ కోటరెడ్డి, ఢిల్లీ రాజు, మార్తి లక్ష్మి, సాలా సావిత్రి, పతివాడ రమేష్, సప్పా ఆదినారాయణ, గారా త్రినాధ్, గుదే రఘునరేష్, అందనాపల్లి సత్యనారాయణ, పెంకే సురేష్, రాజశేఖర్, వై.ఉదయభాస్కర్, కుక్కా తాతబ్బాయి, ఆసూరి సుధాకర్, కాటం రజనీకాంత్, మరుకుర్తి కుమార్, మాసా రామ్‌జోగ్, కంది రాఘవ, కోడికోట సత్తిబాబు, కొమ్ము జిగ్లేర్, ఉల్లం రవి, తదితరులు పాల్గొన్నారు.