లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి గవర్నర్‌ అధికార పర్యటన

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2 : దాదాపు 54 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి, అనుబంధ క్లబ్‌లు లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి పుష్కర్‌, లయన్స్‌  క్లబ్‌ రాజమండ్రి సెంటినరీ పవర్‌, లియో క్లబ్‌ ఎస్‌.ఆర్‌.కె.సి. ఏంజల్స్‌, లియో క్లబ్‌ రాజమండ్రి జి.వి.పి. హెల్పింగ్‌ హేండ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో రిపబ్లిక్‌-డే ఉత్సవాల్లో అనేక సేవా కార్యక్రమాలు  చేపట్టాయి. వీటిని పర్యవేక్షించడానికి అనకాపల్లి నుండి లయన్స్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ లయన్‌ వి.ఎస్‌.నూకరాజు అధికార పర్యటనకు విచ్చేశారు. మొదటిగా 100 అడుగుల జాతీయ జెండాను లయన్స్‌ లియో సభ్యులు అందరూ కలిసి టోల్‌గేట్‌ నుండి రాజమండ్రి స్టేషన్‌ వద్ద ఉన్న శ్రీనివాస రామానుజం మున్సిపల్‌ హైస్కూల్‌లో లయన్‌ వి.అశ్వత్ధనారాయణ, లయన్‌ ప్రవీణ్‌ సాగర్‌చే నిర్మించబడిన పరిశుభ్ర నీటి సదుపాయములు ప్రారంభించారు. తదుపరి సాయిచైతన్య, నగర మున్సిపల్‌ పార్క్‌ని దత్తత తీసుకుని అందు అన్ని విధాలా పరిసర ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధిపరచడానికి శంకుస్థాపన చేశారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా జెండా ఆవిష్కరించి, 50 మొక్కలను నాటారు. లయన్‌ అశ్వత్థనారాయణ, ప్రెసిడెంట్‌ జయశ్రీ సౌజన్యంతో చైతన్య మున్సిపల్‌ పార్క్‌ వద్ద చెత్త కుండీని ఏర్పాటు చేశారు. రూ.10వేలు సహకారంతో వెంకటలక్ష్మి అనుమతి లేదు. ఉపాధిగా ఉండే అందులకు ఫలహారాలు అమ్ము బండిని తాడితోట యన్‌.వి.ఆర్‌. మున్సిపల్‌ స్కూల్‌ వికలాంగుల విభాగానికి  స్కూల్‌ వికలాంగుల విభాగానికి అల్మార, పిల్లలకు  యూనిఫారాలు అందజేశారు.  ఒక బీద విద్యార్ధినికి సైకిల్‌ అందజేశారు. జననీ వికలాంగుల స్కూల్‌లో టీచర్‌కి రూ.18వేలు సంవత్సర భత్యం, యస్‌.కె.ఆర్‌. కాలేజీలో ఫ్యాషన్‌ డిజైన్‌ డిపార్టుమెంట్‌కు సౌకర్యాలు ఏర్పాటుగా రెండు ఫ్యాన్‌లు, పెద్ద అద్దం, కుట్టుమిషన్‌ అందజేశారు. క్లబ్‌ ద్వారా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో 200 మంది వృద్ధులకు, బీదలకు అన్న ప్రసాద వితరణ చేశారు. స్త్రీల వృత్తి, విద్యాశిక్షణా శిబిరానికి  ఒక కుట్టు మిషన్‌ అందజేశారు. తదుపరి ఉడిపి అక్షయ ఫంక్షన్‌ హాలులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ప్రెసిడెంట్‌ లయన్‌ యన్‌.జయశ్రీ సారధ్యంలో సెక్రటరీ లయన్‌ జి.శ్యామలకుమారి, ట్రెజరర్‌ లయన్‌.వి.రాఘవరావు  ఆధ్వర్యంలో జరిగిన వివిధ సేవా కార్యక్రమాలను లయన్స్‌ గవర్నర్‌ లయన్‌ వి.యస్‌.నూకరాజు వివరించారు. లయన్‌ డి.ఎస్‌.వర్మ సహకారంతో ఒక స్త్రీకి స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్‌ ఇచ్చారు. ఈ సంవత్సరం లయన్స్‌ ఇంటర్నేషనల్‌ 100వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను చేస్తున్నారు. ఇప్పటికీ హెపటైటిస్‌-బి వ్యాధి నిరోధక క్యాంప్‌లు 185 అయినట్లు ప్రాజెక్ట్‌ చైర్మన్‌ లయన్‌ గ్రంథి వెంకటేశ్వరరావు తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి అడుగుజాడలలో లయన్స్‌ క్లబ్‌ రాజమండ్రి పుష్కర క్లబ్‌ కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇనుగంటివారి పేటను దత్తత తీసుకుని వివిధ కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రెసిడెంట్‌ లయన్‌ సత్యమోహనరావు తెలియజేశారు. కొత్తగా ఈమధ్య స్థాపించబడిన లయన్స్‌ క్లబ్‌ సెంటీనియల్‌ పవర్‌ ప్రెసిడెంట్‌ లయన్‌ కొల్లి రత్నాకర్‌ మాట్లాడుతూ కరెంటు వినియోగంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని, ఇంకా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు.  ఒక స్త్రీకి స్వయం ఉపాధిగా కుట్టుమిషన్‌ అందజేశారు.  సమావేశ సంధానకర్తగా లయన్‌ గ్రంథి లక్ష్మీ వసంతకుమారి వ్యవహరించారు. నగర ప్రముఖులు, లయన్స్‌ రీజినల్‌ చైర్మన్‌ లయన్‌ కొల్లూరి గోపాలకృష్ణ, జోనల్‌ చైర్మన్‌లు లయన్‌ కె.యస్‌.యల్‌.ప్రసాద్‌, లయన్‌ శ్రీనివాస్‌, లయన్‌ ఎస్‌.వి.వి.సత్యనారాయణ, లయన్‌ మాటూరి రంగారావు, అశ్వత్థనారాయణ, గుబ్బల రాంబాబు, తిక్కన, వెంకటేశ్వరరావు, జి.శ్యామల కుమారి, గోలి రవి, బాల సుబ్రహ్మణ్యం, జోనల్‌ చైర్మన్‌ సలాది శ్రీనివాసరావు, యన్‌.వి.ఆర్‌.గుప్తా,  కె.బుచ్చిరాజు పాల్గొన్నారు.