హొదాపై ప్రగల్భాలేనా? 

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2  : సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారో?, ఆ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ఏమిటో  ఎవరికి అర్ధం కావడం లేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ అన్నారు. పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కాకినాడ తదితర ప్రాంతాల్లో బహిరంగసభలు ఏర్పాటు చేసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని, రాజధాని భూ  దోపిడినీ ప్రశ్నిస్తానని నమ్మించారని, ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదన్నారు. పవన్‌కళ్యాణ్‌ ఉచ్చులో యువత పడవద్దని ఆయన కోరారు.ఈ సమావేశానికి నగర కార్యదర్శి పొట్నూరి అప్పలస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పెండ్యాల కామరాజు, పొట్నూరి అప్పలస్వామి, డి.వి. రమణమూర్తి, బూసిం వై.వి. సత్యనారాయణ, జిఎంకె నాగేంద్రప్రసాద్‌, జిత్తుక అప్పన్న, సిమ్మా దుర్గారావు, గోపి శ్రీనివాసరావు, శీతిన సురేష్‌, బుక్కా శ్రీనివాసరావు, సత్తిర్తి శ్రీనివాసరావు, జె.సత్యశేఖర్‌, మాసా అప్పాయమ్మ, చల్లా లక్ష్మీ, నల్లా వరలక్ష్మీ, సత్తిర్తి కొండమ్మ, రంగాల అప్పలనర్సమ్మ, పుట్ల వెంకటేశ్వరరావు, కానుమూని దుర్గా రావు,నల్లా దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.