శ్రీరామనగర్‌లో డ్రైన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన

రాజమహేంద్రవరం, మార్చి 13 : స్ధానిక 42 వ డివిజన్‌ శ్రీరామనగర్‌లో  శ్రీ సంకట హర వరసిద్ధి వినాయక ఆలయం ఎదుట వీధిలో డ్రైనేజీ పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, స్ధానిక కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మీ, కో ఆప్షన్‌ సభ్యులు అవధానులు సంజీవరావులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 43 వ డివిజన్‌ మాజీ  కార్పొరేటర్‌ పరిమి వాసు, 42 వ డివిజన్‌ తెదేపా అధ్యక్షులు మళ్ళ వెంకట్రాజు, ఎం.ఏ రషీద్‌, ఎం.సత్యనారాయణ,  వానపల్లి శ్రీనివాసరావు, భీశెట్టి అప్పలరాజు, స్ధానిక పెద్దలు ఏ.సీతారామయ్య, జి.రాంప్రసాద్‌, అత్తిలి రామకృష్ణ, మోతా చినబాబు, కాంట్రాక్టర్‌ అనంతగిరి, వర్క్‌ ఇనస్పెక్టర్‌ రామ్మోహన్‌ పాల్గొన్నారు.