పన్నులు తగ్గించే వరకు పోరుబాటే 

  వైకాపా గ్రేటర్‌ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌
రాజమహేంద్రవరం, మార్చి 13 : సామాన్యులపై పెనుభారం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన గృహ, నీటి పన్నులను తగ్గించే వరకు వైఎస్సార్‌  కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమం చేస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ   గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్‌ ప్రసాద్‌ వెల్లడించారు. పెంచిన పన్నులను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ కందుల,  వైకాపా రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు తదితర నాయకులతో కలిసి బొమ్మూరు తహశిల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భరగా మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జీవనం సాగించేందుకు వీల్లేని విధంగా పన్నులను 300 రెట్లు పెంచి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ధ్వజమెత్తారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రజల ఆర్ధిక ఇబ్బందులను పట్టించుకోకుండా భారీగా ఇంటి, నీటి చార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, పన్నులు పెంచడానికి ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎలా అమలు చేస్తారని నిలదీసారు.   ఆకుల మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా పన్నులు ఎలా చెల్లించడానికి సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పెంచిన ఇంటి, నీటి పన్నులను తగ్గించేవరకు వైకాపా ఆందోళన చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ వెలుగుబంటి అచ్యుతరామ్‌, పార్టీ నాయకులు బొప్పన సుబ్బారావు, మెండా సత్తులు, ఆచంట సుబ్బారాయుడు, చిక్కాల బాబులు, టివిఎస్‌ నాయుడు, చిన్నా, కురుమళ్ల ఆంజనేయులు, పేట రామకృష్ణ, చీరా రాజు, నెల్లి సర్వేశ్వరరావు, బొమ్ము శ్రీను, బత్తిన అప్పారావు, మీగడ గంగాధర్‌, పుచ్చా సత్యనారాయణ, ముద్దాల అను, దండంగి శ్రీను, ముంతా సుమతి, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, బొప్పన నరేంద్ర, అంబటి శ్రీను, చంటి, ఆకుల శ్రీను, నెర్సు వెంకట్రావు, వేమన రామకృష్ణగౌడ్‌, ఎం.రామకృష్ణ, టేకి శ్రీను, ఎస్‌కె బాజీ, పాకలపాటి చిట్టిబాబు, సుంకవల్లి ప్రసాద్‌, చిట్టూరి వెంకట్రావు, ఆలీ, శ్రీరంగం శ్రీనివాస్‌, దాకే శ్రీను, ఏడిద ప్రసన్నకుమార్‌ (పండు), మోర్త పవనమూర్తి, విప్పర్తి ఫణికుమార్‌, సుంకవల్లి ప్రసాద్‌  పాల్గొన్నారు.