30న జిత్‌మోహన్‌ మిత్ర 75 వ జన్మదిన వేడుకలు 

రాజమహేంద్రవరం, మార్చి 27 : ప్రముఖ సినీ, రంగస్థల నటులు, గాయకుడు శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రా 75వ జన్మదినోత్సవ వేడుకలను ఈ నెల 30 న ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు జిత్‌ మిత్ర బృందం సభ్యులు దొండపాటి సత్యంబాబు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఆనం కళా కేంద్రంలో మధుర గీతాల ఆలాపన జరుగుతుంది. షైలిక పాత్రో కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు తిరుపతి త్యాగరాజు, కవి మహ్మద్‌  ఖాదర్‌ఖాన్‌, క్రీడాకారుడు దాయం స్టీవెన్‌సన్‌లకు ఆత్మీయ సత్కారాలు జరుగుతాయని ఆయన తెలిపారు. కళాభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.