పడాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రామ్‌చరణ్‌ పుట్టినరోజు వేడుకలు

రాజమహేంద్రవరం, మార్చి 27 : పడాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రామ్‌చరణ్‌ తేజ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్యాపురంలోని గోదావరి గట్టుపై ఉన్న శంకరఘాట్‌ శివాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం శంకరమఠం ఘాట్‌లో జన్మదిన వేడుకలు జరిపారు. తెలుగు చలనచిత్ర సీమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని అనేక విజయాలతో దూసుకుపోతున్న  రామ్‌చరణ్‌ మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పడాల వెంకటేష్‌, మెండా అంజిబాబు, వీరాంజనేయులు, వీరబాబు, కారి, పాల రమేష్‌, ఎస్‌.సత్తిబాబు,  ఖాన్‌, మణికంఠ, సతీష్‌, పడాల యేసుబాబు, సత్తిబాబు, సాయి, పి.మధుకుమార్‌, ఇ.సాయిప్రకాష్‌, టి.బాలాజీ, వి.శ్రీను, ఎ.చిన్న, సిహెచ్‌.కిషోర్‌, ఆర్‌.యేసు, డబ్ల్యూ.నరేష్‌, పి.సతీష్‌, జె.శ్రీనివాస్‌, జె.సునీల్‌, వై.దుర్గారెడ్డి, పడాల శ్రీనివాస్‌, వై.కొండబాబు, ఎస్‌.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.